ఎల్బీ స్టేడియంలో పవన్ కల్యాణ్ ను హత్తుకుని భోరున విలపించిన గద్దర్ తనయుడు
- గద్దర్ భౌతికకాయం ఎల్బీ స్టేడియంకు తరలింపు
- ఎల్బీ స్టేడియంకు వచ్చిన పవన్ కల్యాణ్
- తన సన్నిహితుడు గద్దర్ భౌతికకాయానికి పవన్ నివాళి
- గద్దర్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన జనసేనాని
జన గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ భౌతికకాయాన్ని హైదరాబాదులోని అపోలో స్పెక్ట్రా ఆసుపత్రి నుంచి ఎల్బీ స్టేడియంకు తరలించారు. ప్రజలు, అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం ఈ నిర్ణయం తీసుకున్నారు.
కాగా, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా ఎల్బీ స్టేడియానికి వచ్చి తన సన్నిహితుడు గద్దర్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. గద్దర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా గద్దర్ కుమారుడు సూర్యుడు... పవన్ ను చూడగానే తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. పవన్ ను హత్తుకుని భోరున విలపించారు. ఓ దశలో పవన్ కూడా కన్నీరు పెట్టినట్టు వీడియోలో కనిపించింది.