మెగా ఫ్యామిలీ నుంచి ప్రతిరోజూ ఫుడ్ వచ్చేది: 'భోళాశంకర్' ఈవెంటులో కీర్తి సురేశ్
- హైదరాబాదులో 'భోళా శంకర్' ప్రీ రిలీజ్ ఈవెంట్
- మెగాస్టార్ చెల్లెలి పాత్ర చేయడం అదృష్టమన్న కీర్తి సురేశ్
- ఆయన అంకితభావం చూసి ఆశ్చర్యపోయానని వెల్లడి
- ఆగస్టు 11వ తేదీన విడుదల కానున్న సినిమా
చిరంజీవి కథానాయకుడిగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో 'భోళా శంకర్' సినిమా రూపొందింది. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమాకి, మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందించాడు. ఈ నెల 11వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును హైదరాబాదు - 'శిల్పకళావేదిక'లో నిర్వహించారు.
ఈ వేదికపై కీర్తి సురేశ్ మాట్లాడుతూ .. "ఈ సినిమాలో బ్రదర్ - సిస్టర్ ట్రాక్ ఉంది. ఈ సినిమాతో నాకు మెహర్ రమేశ్ రూపంలో మరో అన్నయ్య దొరికాడు. నన్ను నమ్మి ఈ పాత్రను ఇచ్చినందుకు అన్నయ్యకి థ్యాంక్స్ చెబుతున్నాను. తమన్నా లాంటి ఒక మంచి ఫ్రెండ్ ను కూడా ఈ సినిమా ఇచ్చింది" అన్నారు.
"మెగాస్టార్ గురించి విన్నాను .. ఆయన నుంచి ఎన్ని నేర్చుకోవచ్చనేది ఈ సినిమా చేయడం వలన తెలుసుకున్నాను. షూటింగు జరిగినన్ని రోజులు ఆయన ఇంటి నుంచి ఫుడ్ వచ్చేది. అందుకు నేను సురేఖ గారికి థ్యాంక్స్ చెబుతున్నాను. నిజంగా ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవలసిన వ్యక్తిత్వం ఆయనది. ఆయన చెల్లెలిగా నటించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది" అంటూ చెప్పుకొచ్చారు.