భారత్ పర్యటనకు రాకముందే ఆసీస్ జట్టుకు ఎదురుదెబ్బ!
- సెప్టెంబరులో భారత్ రానున్న ఆస్ట్రేలియా జట్టు
- సెప్టెంబరు 22 నుంచి మూడు వన్డేల సిరీస్
- అక్టోబరులో వరల్డ్ కప్
- ఇటీవల యాషెస్ లో కమిన్స్ కు గాయం
- వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని కమిన్స్ కు విశ్రాంతి!
భారత్ లో అక్టోబరులో వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుండగా, దానికి ముందుగా ఆస్ట్రేలియా జట్టు భారత్ లో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఆసీస్ 3 వన్డేలు ఆడనుంది. సెప్టెంబరు 22, 24, 27 తేదీల్లో ఈ మ్యాచ్ లు జరగనున్నాయి. అయితే, ఈ సిరీస్ కు ఆసీస్ సారథి, ప్రధాన పేసర్ పాట్రిక్ కమిన్స్ దూరమయ్యే అవకాశాలున్నాయి.
ఇటీవల ఇంగ్లండ్ తో జరిగిన యాషెస్ సిరీస్ లో కమిన్స్ మణికట్టుకు గాయమైంది. కమిన్స్ గాయంతోనే యాషెస్ సిరీస్ ఆడాడు. అయితే కీలకమైన వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని, వచ్చే నెలలో భారత్ లో జరిగే వన్డే సిరీస్ కు కమిన్స్ కు విశ్రాంతినివ్వాలని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఆలోచిస్తోంది. కమిన్స్ గైర్హాజరీ నేపథ్యంలో టీమిండియాతో 3 వన్డేల సిరీస్ కు కంగారూలకు యువ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ సారథ్యం వహించనున్నాడు.
ఇక, ఆసీస్ జట్టు వరల్డ్ కప్ ముగిసిన తర్వాత కూడా భారత్ లోనే ఉండనుంది. టీమిండియాతో ఆసీస్ 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ లో తలపడనుంది.