ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన షెడ్యూల్ ఖరారు

  • ఇటీవల ఏపీలో భారీ వర్షాలు
  • గోదావరి పరీవాహక ప్రాంతాల జిల్లాల్లో వరదలు
  • ముంపు బాధితులను పరామర్శించనున్న సీఎం జగన్
  • ఈ నెల 7, 8 తేదీల్లో పర్యటన
ఇటీవల కురిసిన వర్షాలకు ఏపీలో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ప్రజలు ముంపుబారినపడడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, సీఎం జగన్ ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. రెండ్రోజుల పాటు సాగనున్న ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులతో సీఎం సమావేశం కానున్నారు. రేపు, ఎల్లుండి ఆయన పర్యటన సాగనుంది.

షెడ్యూల్ ఇలా...

  • జులై 7 ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరతారు.
  • ఉదయం 10.30 గంటలకు అల్లూరి జిల్లా కూనవరం మండలం కోతులగుట్ట గ్రామానికి చేరుకుంటారు.
  • ఉదయం 11 గంటలకు కూనవరం బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై కూనవరం, వీఆర్ పురం మండలాల వరద బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు. 
  • మధ్యాహ్నం 2 గంటలకు కుక్కునూరు మండలం గుమ్ముగూడెం గ్రామానికి చేరుకుంటారు.
  • సుమారు 30 నిమిషాల పాటు గ్రామంలో వరద ముంపుకు గురైన ప్రదేశాలను పరిశీలిస్తారు. వరద బాధిత కుటుంబాలతో మాట్లాడతారు.
  • సాయంత్రం 4.30 గంటలకు రాజమండ్రి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు. రాజమండ్రి నేతలతో సమావేశం అవుతారు. రేపు రాత్రికి అక్కడే బస చేస్తారు.
  • జులై 8వ తేదీ ఉదయం 10 గంటలకు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గురజపులంక వెళతారు. అక్కడి ముంపు బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు.
  • ఆ తర్వాత, రామాలయంపేట గ్రామం సమీపంలోని తానేలంక చేరుకుంటారు. అక్కడ అయినవిల్లి మండలం, తోటరాముడివారిపేట వరద బాధితులతో సమావేశం కానున్నారు.
  • మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం జగన్ తాడేపల్లి తిరుగు ప్రయాణమవుతారు.


More Telugu News