బీఆర్ఎస్‌తో మైత్రిపై అక్బరుద్దీన్ కీలక వ్యాఖ్యలు!
- తెలంగాణలో తమ ప్రయాణం బీఆర్ఎస్‌తోనేనన్న అక్బరుద్దీన్
- కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని అన్ని రాష్ట్రాలు చూసి నేర్చుకోవాలని వ్యాఖ్య
- తెలంగాణ సీఎంగా కేసీఆర్ ఉండటం గర్వంగా భావిస్తున్నామని ప్రశంసలు
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రశంసలు కురిపించారు. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని అన్ని రాష్ట్రాలు చూసి నేర్చుకోవాలని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండటం గర్వంగా భావిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో తమ ప్రయాణం బీఆర్ఎస్ పార్టీతోనే అని అసెంబ్లీలోనే స్పష్టం చేశారు. తాము కేవలం ఆ పార్టీతోనే కలిసి ఉంటామని చెప్పారు.
సీఏఏను వ్యతిరేకించినందుకు, యూసీసీకి వ్యతిరేకం అని ప్రకటించినందుకు బీఆర్‌ఎస్‌కు అక్భరుద్దీన్ ధన్యవాదాలు తెలిపారు. ‘‘రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారు. ఇక్కడ ఎలాంటి ఘర్షణలు జరగడం లేదు. ప్రభుత్వం రైతులకు ఉచితంగా 24 గంటల కరెంటు ఇస్తోంది. మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు అందిస్తోంది. ప్రతిపథకం అద్భుత ఫలాలను ఇస్తోంది” అని ప్రశంసలు కురిపించారు.