కస్టమర్లకు స్వయంగా డెలివరీ చేసిన జొమాటో అధినేత
- ఫ్రెండ్ షిప్ డే రోజున జొమాటో సీఈవో డెలివరీ బోయ్ అవతారం
- ఫ్రెండ్ షిప్ బ్యాండ్లు, ఫుడ్ డెలివరీ
- కస్టమర్లు, ఉద్యోగులకు చేరువ అయ్యే ప్రయత్నం
జొమాటో వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ తానే స్వయంగా బైక్ పై బయల్దేరి ఆర్డర్లు డెలివరీ చేశారు. ఈ విధంగా ఆయన ఫ్రెండ్ షిప్ డేని సెలబ్రేట్ చేసుకున్నారు. డెలివరీ భాగస్వాములు, రెస్టారెంట్ భాగస్వాములు, కస్టమర్లకు ఫ్రెండ్ షిప్ డే బ్యాండ్లు, ఫుడ్ ను పంపిణీ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోని దీపిందర్ గోయల్ ట్విట్టర్ లో షేర్ చేశారు.
రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ పై జొమాటో టీ షర్ట్ ధరించి హెల్మెట్ పెట్టుకోవడం ఫొటోలో కనిపిస్తుంది. జొమాటో బ్రాండింగ్, ఫ్రెండ్ షిప్ కొటేషన్లతో కూడిన హ్యాండ్ బ్యాండ్ లను ఆయన పంపిణీ చేసిన వాటిల్లో ఉన్నాయి. అప్పుడప్పుడు జొమాటో సీనియర్ ఉద్యోగులు స్వయంగా ఆర్డర్ల డెలివరీ పని చేస్తుంటారు. తద్వారా డెలివరీ భాగస్వాములు, కస్టమర్ల అవసరాలు, ఇబ్బందులను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. సేవలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవడమే దీని వెనుక ఉన్న లక్ష్యం.
దీపిందర్ గోయల్ షేర్ చేసిన పోస్ట్ ను చూసి యూజర్లు ఉత్సాహంగా కామెంట్లను పోస్ట్ చేస్తున్నారు. చండీగఢ్ లో మీరు డెలివరీ చేస్తున్నారా? ఏదో ఒక రోజు మిమ్మల్ని నాకు డెలివరీ చేసే పార్ట్ నర్ గా చూస్తానని అనుకుంటున్నాను’’అని ఒక యూజర్ కామెంట్ చేశారు.