వీడిన సందిగ్ధం.. ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం.. కాసేపట్లో సభ ముందుకు బిల్లు!

  • రవాణా శాఖ అధికారులతో చర్చల తర్వాత బిల్లుకు ఆమోదం తెలిపిన తమిళిసై
  • ఈ రోజే సభలో బిల్లును ప్రవేశపెడతామన్న మంత్రి పువ్వాడ
  • రెండు రోజుల తీవ్ర ఉత్కంఠకు తెర
తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి మార్గం సుగమమైంది. ప్రభుత్వం రూపొందించిన ఆర్టీసీ విలీన బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. రెండు రోజుల తీవ్ర ఉత్కంఠ తర్వాత, పలు అంశాలపై స్పష్టత తీసుకుని ఓకే చెప్పారు. 

ఈ రోజు రాజ్‌భవన్‌లో రవాణా శాఖ అధికారులతో గవర్నర్ తమిళిసై సమావేశమయ్యారు. బిల్లులో తనకు ఎదురైన సందేహాలపై చర్చించారు. అధికారుల వివరణ తర్వాత ఆర్టీసీ విలీన బిల్లుకు ఆమోదం తెలుపుతూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు.

ఇక తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి, పాస్ చేయడమే మిగిలింది. ఈ రోజే సభలో బిల్లును ప్రవేశపెడతామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రకటించారు. దీంతో మరికాసేపట్లో అసెంబ్లీ ఆమోదం కోసం సభ ముందుకు ఆర్టీసీ బిల్లు రానుంది.


More Telugu News