తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా రైలులోనే ప్రయాణిస్తా: గవర్నర్ తమిళిసై

  • అమృత్ భారత్ పథకం కింద 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని శంకుస్థాపన
  • నాంపల్లి స్టేషన్ ఆధునికీకరణ పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న తమిళిసై
  • సామాన్యుల కోసమే ప్రధాని అభివృద్ధి చేస్తున్నారని వెల్లడి
అమృత్ భారత్ పథకం కింద దేశంలోని 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను ప్రారంభించే కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. సామాన్యుల కోసమే రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. వేల కోట్లు ఖర్చు చేసి స్టేషన్లను ఆధునీకరిస్తున్నారని చెప్పారు. మంచి రైల్వే వ్యవస్థ ఉంటే విద్యార్థులు, రోగులు, వృద్ధుల ప్రయాణం సురక్షితంగా, సౌకర్యంగా జరుగుతుందని అన్నారు. నాంపల్లి ఆధునికీకరణకు నిధులు కేటాయించినందుకు మోదీకి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఇకపై తాను తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా రైలులోనే ప్రయాణిస్తానని చెప్పారు.


More Telugu News