రెండు చేతులతో రెండు పాములను పట్టేసిన సాహస మహిళ.. వీడియో!
- రెండు పాములు మెలిక వేసుకుని కలిసి ఉండడం చూసిన మహిళ
- ఒక్కసారిగా వాటిపైకి దూకేసి చేతులతో బంధించేసిన ఘటన
- విషపూరితమైనవి కావేమోనన్న సందేహం
పామును చూస్తే చాలు ఎక్కువ మంది పరుగు అందుకుంటారు. కానీ కొందరు ఏ మాత్రం చలించకుండా ధైర్యంగా వాటిని పట్టుకోవడమో లేదా చంపడమో చేస్తుంటారు. ఇక్కడ మాత్రం ఓ మహిళ ఇతరులతో పోలిస్తే కొంచెం అధిక సాహసమే చేసిందని చెప్పుకోవాలి. రెండు పాములు మెలికలు వేసుకుని కలిసి ఉన్న సందర్భంలో రెండింటినీ పట్టేసుకుంది. వీడియో చూస్తే ఆమె ధైర్యానికి జోహార్లు చెప్పాలనిపిస్తుంది.
ఈ వైరల్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిపోయింది. మన దేశంలోనే ఎక్కడో తెలియదు కానీ, ఓ విద్యా కేంద్రంలో ఇది చోటు చేసుకుంది. పాములను చూసిన ఆమె ఒక్కసారిగా కాలువలోకి దిగిపోయి రెండు చేతులతో రెండింటినీ పట్టేసుకుంది. ఒకటి తప్పించుకుని పారిపోతుండగా, తిరిగి పట్టేసుకుంది. వాటిని అదుపు చేయడానికి ఆమె ప్రయత్నం చేయడాన్ని వీడియోలో చూడొచ్చు.
సాధారణంగా నాగుపాము అయితే ఎంతో చురుగ్గా ఉంటుంది. బుస్ అంటూ పడగవిప్పి కాటు వేస్తుంది. కానీ, ఇక్కడ సదరు మహిళ పట్టుకున్న పాములు తాచు పాములు లేదా విషపూరితమైనవి కానట్టుంది. ఎందుకంటే అవి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయే కానీ, ఎదురుదాడికి దిగడం లేదు.
ఈ వీడియోని చూసి ఇన్ స్టా యూజర్లు కొందరు అభినందిస్తుంటే, కొందరు ఆమె ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందేమోనన్న ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు యూజర్లు అయితే ఆ పాములకు ఎందుకు అసౌకర్యం కలిగించడం? అంటూ ప్రశ్నిస్తున్నారు. (ఇన్ స్టా గ్రామ్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి)