కానిస్టేబుల్‌ను హత్య చేసిన భార్య.. పోలీసుల ముందు అతి చేసి దొరికిపోయిన నిందితురాలు
- తమది అన్యోన్య దాంపత్యమని పోలీసులను నమ్మించేందుకు భార్య అత్యుత్సాహం
- భర్తకు సాయపడుతున్నట్టు పలు వీడియోలు చూపించిన నిందితురాలు
- వీడియోలు చూసిన పోలీసులకు నిందితురాలు ముందస్తుగా ప్రణాళిక వేసుకున్నట్టు డౌట్
- ఈ దిశగా జరిగిన దర్యాప్తుతో కుట్ర బట్టబయలు
విశాఖపట్నం కానిస్టేబుల్ రమేశ్ హత్య కేసులో పోలీసులు పలు కీలక విషయాలు వెల్లడించారు. వివాహేతర సంబంధం కారణంగా అతడిని అడ్డుతొలగించుకున్న భార్య శివజ్యోతి ఆపై తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు పడ్డ తాపత్రయమే అనుమానాలు రేకెత్తించిందని పేర్కొన్నారు. భర్త హత్యకు కొన్ని రోజుల ముందు నుంచే అతడితో ప్రేమగా ఉన్నట్టు నిందితురాలు కొన్ని వీడియోలు తయారు చేసినట్టు పోలీసులు గుర్తించారు.
మద్యం మత్తులో తూలిపోతున్న రమేశ్‌ను మంచంపై పడుకోబెట్టడం, భార్య మంచిదని అతడు వీడియోలో చెప్పడం వంటి దృశ్యాలు ఆమె చాకచక్యంగా రికార్డు చేసింది. హత్య అనంతరం విచారణకు వచ్చిన పోలీసులకు శివజ్యోతి ఈ వీడియోలను చూపించి తమది అన్యోన్య దాంపత్యమని చెప్పుకునే ప్రయత్నం చేసింది. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారమే ఆమె ఇదంతా చేసి ఉంటుందని అనుమానించిన పోలీసులు చివరకు వాస్తవాన్ని వెలికి తీశారు. ఈ కేసులో ఏ1గా ఉన్న శివజ్యోతి, ఏ2గా ఉన్న ఆమె ప్రియుడు రామారావు, ఏ3 అయిన వెల్డర్ నీలాను శనివారం రిమాండ్‌కు తరలించినట్టు ఎంవీపీ స్టేషన్ సీఐ తెలిపారు.