చంద్రయాన్-3లో కీలక ఘట్టం పూర్తి.. చంద్రుడి కక్ష్యలోకి వ్యోమ నౌక ప్రవేశం

  • శనివారం రాత్రి గం.7.15లకు చంద్రుడి కక్ష్యలోకి ప్రవే శం 
  • చంద్రయాన్-3 ఇక చంద్రుడి చుట్టూ తిరగనుంది
  • మూడింట రెండొంతుల ప్రయాణం పూర్తి చేసిన వ్యోమనౌక
ఇస్రో జులై 14న ప్రయోగించిన చంద్రయాన్-3 కీలక ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. భూకక్ష్య నుండి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. సరిగ్గా శనివారం రాత్రి గం.7.15 సమయానికి చంద్రుడి కక్ష్యలోకి వెళ్లింది. 

  చంద్రయాన్-3ని చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రక్రియను ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది. బెంగళూరులోని ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్ వర్క్ నుండి దీనిని చేపట్టింది. ఈ వ్యోమ నౌక తన ప్రయాణంలో ఇప్పటివరకు మూడింట రెండొంతులను పూర్తి చేసింది. ఈ కక్ష్యలో చంద్రయాన్-3 పద్దెనిమిది రోజుల పాటు తిరగనుంది. ఆగస్ట్ 23 లేదా 24న దక్షిణ ధృవంపై ల్యాండ్ కానుంది. 


More Telugu News