అందరినీ 'ప్రేమ్ కుమార్' హాయిగా నవ్విస్తాడు: హీరో సంతోష్ శోభ‌న్‌

  • సంతోష్ శోభన్ హీరోగా 'ప్రేమ్ కుమార్'
  • హీరోయిన్స్ గా రుచిత - రాశి సింగ్ 
  • దర్శకుడిగా అభిషేక్ మహర్షి పరిచయం 
  • ఆగస్టు 18వ తేదీన పరిచయం 
కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫ‌రెంట్ మూవీస్‌తో త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో సంతోష్ శోభ‌న్ తాజా చిత్రం ‘ప్రేమ్ కుమార్’. ల‌వ్ అండ్ ఎంట‌ర్‌టైనింగ్ ఎలిమెంట్స్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా ఆగ‌స్ట్ 18న‌ రిలీజ్ అవుతోంది. రైట‌ర్‌ అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శివప్రసాద్ పన్నీరు ఈ సినిమాను నిర్మించాడు. రాశీ సింగ్, రుచిత సాదినేని హీరోయిన్లు.

ఈ రోజున ఈ మూవీ ప‌రిచ‌య వేదిక కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈవెంట్‌లో హీరో సంతోష్ శోభ‌న్‌, హీరోయిన్స్ రుచిత సాధినేని, రాశీ సింగ్, నిర్మాత శివ ప్ర‌సాద్‌, ద‌ర్శ‌కుడు అభిషేక్ మ‌హ‌ర్షి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌.అనంత శ్రీక‌ర్‌, కాస‌ర్ల శ్యామ్‌, రైట‌ర్ అనిరుధ్ కృష్ణ‌మూర్తి, యాక్ట‌ర్ ప్ర‌భావ‌తి, యాక్ట‌ర్ అశోక్ కుమార్‌, రోల్ రైడా, సింగ‌ర్‌ ధ్రువ‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు. 

నిర్మాత శివ ప్ర‌సాద్ మాట్లాడుతూ .. "అభిషేక్‌, సంతోష్ శోభ‌న్‌గారి వ‌ల్ల‌నే సారంగ బ్యాన‌ర్‌ను స్టార్ట్ చేశాం. సంతోష్ ను పేరు పెట్టి పిలిచిన సంద‌ర్భాలు త‌క్కువ. డార్లింగ్ అనే పిలుస్తుంటాను. ఈ స్టోరి త‌న‌కు న‌చ్చ‌టంతో ఈ సినిమా చేయాల‌ని సంతోష్ డిసైడ్ అయ్యాడు. ఆడియెన్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేయాల‌నేదే ల‌క్ష్యంగా చేసిన సినిమా. ఆగ‌స్ట్ 18న వ‌స్తోన్న మా ‘ప్రేమ్ కుమార్’ను అంద‌రూ చూసి న‌వ్వుకుంటార‌ని భావిస్తున్నాను" అని అన్నాడు. 

 రుచితా సాధినేని మాట్లాడుతూ ‘‘ప్రేమ్ కుమార్’లో 'అంగన' అనే పాత్ర చేశాను. డబ్బున్న అమ్మాయి ఎలా ఉండ‌కూడ‌దో అలా ఉండే టైప్‌. ఎంజాయ్ చేస్తార‌ని భావిస్తున్నాం’’ అన్నారు. రాశీ సింగ్ మాట్లాడుతూ ‘‘ఇందులో 'నేత్ర' అనే అమ్మాయిగా క‌నిపిస్తాను. ఫ‌న్‌ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌గా ఈ సినిమా మెప్పిస్తుంది’’ అన్నారు. 

డైరెక్ట‌ర్ అభిషేక్ మ‌హ‌ర్షి మాట్లాడుతూ ‘‘ప్ర‌మోష‌న‌ల్ సాంగ్‌ .. పార్టీ ధావ‌త్ పాట‌ను విన్న ద‌గ్గ‌ర నుంచి ఎప్పుడెప్పుడు రిలీజ్ చేద్దామా? అని ఎదురు చూస్తున్నాం .. ఇప్ప‌టికీ కుదిరింది. అద్భుత‌మైన పాట‌. నిర్మాత శివ ప్ర‌సాద్‌గారితో చాలా ఏళ్లుగా ప‌రిచ‌యం. ఈ క‌థ ఫిక్స్ కావటానికి కార‌ణం సంతోష్ శోభ‌న్‌. అనంత్ అద్భుత‌మైన మ్యూజిక్ ఇచ్చాడు. థియేట‌ర్‌లో సౌండ్ కొత్త‌గా ఉంటుంది. ఆడియెన్స్ స‌ర్‌ప్రైజ్ అవుతారు. 

రాశీ సింగ్‌, రుచిత ఇద్ద‌రు చ‌క్క‌గా న‌టించారు. సంతోష్ శోభన్ స్నేహితుడిగా కృష్ణ తేజ అద్భుతంగా న‌టించాడు. సినిమా చూస్తున్న‌ప్పుడు మ‌న ఫ్రెండ్స్ గుర్తుకొస్తారు. బ‌య‌ట మ‌నం ఎలా ఉంటామో అదే పాత్ర‌ల‌న‌ను తెర‌పై చూస్తారు. డాడీ అనే పాత్ర‌లో సుద‌ర్శ‌న్ సూప‌ర్బ్‌గా న‌టించాడు. గ్యారీ చాలా మంచి స‌పోర్ట్ ఇచ్చాడు. సినిమా బాగా రావ‌టానికి మూల కార‌ణాల్లో త‌ను ఒక‌డు. సినిమాటోగ్ర‌ఫీ రాంకీగారు మంచి విజువ‌ల్స్ అందించారు’’ అన్నారు.

హీరో సంతోష్ శోభ‌న్ మాట్లాడుతూ ‘‘అభిషేక్ మహర్షి, శివ ప్రసాద్లకు థాంక్స్. వాళ్లు నమ్మితేనే సినిమా ఇంత వ‌ర‌కు వ‌చ్చింది. నిజానికి నా సినిమాల్లో అభిషేక్ నటించాడు. త‌ను అప్పుడు డైరెక్ట‌ర్ అవుతాడ‌ని అనుకోలేదు. ఈ సినిమా త‌ర్వాత త‌నెంత మంచి డైరెక్ట‌రో అంద‌రికీ తెలుస్తుంది. భ‌విష్య‌త్తులో హ్యూమ‌ర్‌కి అభిషేక్ ఓ బ్రాండ్ అవుతాడ‌ని న‌మ్మ‌కంగా ఉన్నాను. కామెడీ సినిమా చేయ‌టం అంత గొప్ప విష‌యం కాదు.. కానీ త‌ను గొప్ప‌గా చేశాడు" అంటూ చెప్పుకొచ్చాడు.


More Telugu News