గత ఎన్నికల్లో ఓడిపోవడంతో నా కల నెరవేరలేదు: శ్రీకాళహస్తిలో చంద్రబాబు
- శ్రీకాళహస్తిలో చంద్రబాబు సభ
- అనేక అంశాలను ప్రస్తావిస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించిన టీడీపీ అధినేత
- పోలీసుల్లో తిరుగుబాటు రావాలని పిలుపు
- తనపై దాడులకు పాల్పడిన ఎవరినీ వదలబోనని హెచ్చరిక
సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్దభేరి కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తిలో నారా చంద్రబాబునాయుడు రోడ్ షో/సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను ప్రస్తావిస్తూ ప్రసంగించారు. ప్రజల సమస్యలపై తాను మాట్లాడితే తనపై పోలీసులతో దాడి చేయిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. మాపై దాడులు చేసేవారు... ఇవాళ ఉంటుంది... రేపు ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి అని హెచ్చరించారు.
"పోలీసుల సమస్యలు కూడా నేనే ప్రస్తావించాలి... పోలీసులకు టీఏ, డీఏలు వస్తున్నాయా? ప్రజాహితం కోసం పోలీసుల్లోనూ తిరుగుబాటు రావాలి" అని చంద్రబాబు పిలుపునిచ్చారు. పోలీసుల్ని నేరాల్లో భాగస్వాముల్ని చేద్దామని వైసీపీ చూస్తోందని ఆరోపించారు. ఒకరిద్దరు చెడిపోయిన పోలీసు ఉన్నతాధికారులు వల్ల మంచి పోలీసులకు చెడ్డపేరు వస్తోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబు ప్రసంగం హైలైట్స్...
• పోలీసులకు ప్రభుత్వం టీఏ, డీఏలు కూడా ఇవ్వకుండా, తెలుగుదేశం కార్యకర్తల్ని కొట్టమని మాత్రం లాఠీలు ఇస్తున్నారు
• ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ప్రజాహితం కోసం పోలీసులు పని చేయాలి
• తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదలను.... రాయలసీమకు మీరు నీళ్లు ఇవ్వలేదు అంటే నాపై దాడి చేశారు.
• ఎన్ని ఇబ్బందులు పెట్టినా తెలుగు జాతి కోసం పోరాడుతా... భారతదేశంలో తెలుగు వారిని నెంబర్ వన్ చేస్తా.
• శ్రీకాళహస్తి రాగానే నాకు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గుర్తుకువచ్చారు. ఉన్నతమైన రాజకీయాలు చేసిన వ్యక్తి బొజ్జల. ఆయన ఒకటి అనుకుంటే అయిపోవాల్సిందే
• బొజ్జల కుటుంబం మూడుతరాలుగా ప్రజల్లో ఉన్నారు. బొజ్జల కుటుంబానికి... బియ్యపు మధుసూదన్ రెడ్డికి పోలిక ఉందా.
• సైకో అని పోస్టర్ పెడితే ఎమ్మెల్యే బియ్యపు రెడ్డి ఎందుకు భుజాలు తడుముకుంటున్నాడు?
• సైకో పాలన చేస్తున్న వాళ్లని ప్రజలు సైకోలని పిలుస్తుంటే, అధికారులకు వచ్చిన నష్టం ఏంటి?
• గత ఎన్నికల్లో సైకోకి సహకరించడం వల్లే రాష్ట్రంలో భూముల ధరలు పడిపోయాయి
• హైదరాబాద్ అభివృద్ధి తరహాలోనే రాయలసీమలో పారిశ్రామికాభివృద్ధికి నాంది పలికి ఎన్నో పరిశ్రమలు తెచ్చా
• కమీషన్ల కోసం ఎమ్మెల్యే బియ్యపు రెడ్డి చేస్తున్న కక్కుర్తి పనులకు ఉన్న పరిశ్రమలు పోయే పరిస్థితి నెలకొంది.
• సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీకాళహస్తికి వచ్చాను.
• దేశంలో నీటి కోసం యుద్ధాలు జరుగుతున్నాయి. నీటికి అంత ప్రాధాన్యత ఉంది.
• రాయలసీమ ఎడారిగా మారిపోకుండా ఉండాలని నాడు ఎన్టీఆర్ సీమలో సాగునీటి ప్రాజెక్టులు చేపట్టారు.
• తెలుగు గంగ, నగరి గాలేరు, హంద్రీనీవా ప్రాజెక్టులు ప్రారంభించింది అన్న ఎన్టీఆర్
• నీటి ప్రాధాన్యతను గుర్తించి 2014 తరువాత సాగునీటి ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చాం.
• నేడు కనీసం కాలువలకు నీళ్లు కూడా ఇవ్వని పరిస్థితి.
• నాడు హైదరాబాద్ ను ముందుచూపుతో అభివృద్ధి చేశాను. దీంతో ఇప్పుడు అక్కడ ఎకరా భూమి 100 కోట్లు అయ్యింది.
• అదే విధంగా ఏపీని కూడా అభివృద్ది చేద్దాం అనుకున్నా... కానీ ఎన్నికల్లో ఓటమితో ఆ కల నెరవేరలేదు.
• 2014 తరువాత చిత్తూరు జిల్లాలో పెద్ద ఎత్తున తయారీ పరిశ్రమలు తెచ్చాను.
• రేణిగుంట ఎయిర్ పోర్ట్ ను అభివృద్ది చేశాను.
• ఐఐటీ, ఐఐఎస్ఇఆర్, ఐఐడీటీ వంటి సంస్ధలు మన హయాంలో ఇక్కడికి వచ్చాయి.
• జగన్ వచ్చిన తరువాత ఒక్క సంస్థ వచ్చిందా.... ఒక్క కంపెనీ వచ్చిందా?
• రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించి, ప్రజల జీవితాలు బంగారు జీవితాలు చేయాలి అనుకున్నా.
• కానీ జగన్ ఒక్క చాన్స్ కు, ముద్దులకు మీరు మోసపోయారు.
• సాగునీటి ప్రాజెక్టులపై ప్రశ్నించేందుకు నేను జిల్లాకు వస్తే నన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. మన మీటింగ్ కి వచ్చిన కార్యకర్తలపై దాడులు చేశారు.
• డబ్బుల కోసం అవసరం లేని ప్రాజెక్టులు చేపట్టి పెద్దిరెడ్డి అక్రమాలు చేస్తున్నాడు.
• అవులాపల్లి ప్రాజెక్టు కు ఎన్జీటీ ఫైన్ వేసింది....దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ ఫైన్ చెల్లించింది. పెద్దిరెడ్డి కోసం ప్రజల సొమ్ము ప్రభుత్వం ఎందుకు చెల్లించాలి.
• అససరంలేని ప్రాజెక్టులు చేపట్టి పెద్దిరెడ్డి ప్రభుత్వ సొమ్ముకాజేస్తున్నారు.
• టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత గోదావరి నీరు రాయలసీమకు తీసుకువచ్చి ఇక్కడ ప్రజల కష్టాలు తీర్చుతాను.
• పీఎల్ఆర్ కంపెనీ పెట్టిన పెద్దిరెడ్డి కాంట్రాక్టర్ గా వేల కోట్లు దోచుకుంటున్నాడు
• స్థానిక ఎమ్మెల్యే సహా అక్రమాల ద్వారా తిన్న వైసీపీ ఎమ్మెల్యేలను తిన్నది అంతా కక్కిస్తా.
• రాష్ట్రంలో కురుక్షేత్ర యుద్దం ప్రారంభం అయ్యింది. ధర్మాన్ని కాపాడడానికి జరిగిన యుద్దం కురుక్షేత్రం. ఈ కురుక్షేత్ర యుద్దంలో వైసీపీ కౌరవులను ఓడించాలి.
• శాసన సభను కౌరవ సభను చేసిన వారిని ఓడించాలి... సభను గౌరవ సభ చేస్తాను అని నేను ప్రకటించాను. దీని కోసం మీ మద్దతు కోరుతున్నా.
• రాష్ట్రం బాగుండాలి అని భావిచే వారంతా వైసీపీ నుంచి బయటకు రావాలి.