జనసేనను మా పార్టీలో విలీనం చేస్తే...!: పవన్ కల్యాణ్ కు కేఏ పాల్ ఆఫర్

  • పవన్ ను ప్రజాశాంతి పార్టీ తరఫున సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామని వెల్లడి
  • లోకేశ్ అనే పప్పును సీఎం చేయడానికి పవన్ ప్రయత్నిస్తున్నాడని వ్యాఖ్యలు
  • పవన్ ది వారాహి యాత్ర కాదని, నారాహి యాత్ర అని విమర్శలు
  • విశాఖలో పవన్ వారాహి యాత్ర రద్దు చేసుకోవాలని డిమాండ్
జనసేనాని పవన్ కల్యాణ్ కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆఫర్ ఇచ్చారు. జనసేన పార్టీని తన ప్రజాశాంతి పార్టీలో విలీనం చేస్తే పవన్ ను సీఎంగా అభ్యర్థిగా ప్రకటిస్తామని చెప్పారు. కానీ, పవన్ మాత్రం లోకేశ్ అనే పప్పును ముఖ్యమంత్రిగా చేయడానికి కంకణం కట్టుకున్నాడని విమర్శించారు. 

పవన్ కల్యాణ్ ఈ నెల 10 నుంచి విశాఖలో వారాహి విజయ యాత్ర మూడో దశ చేపట్టనుండగా... విశాఖలో పవన్ వారాహి యాత్రను రద్దు చేసుకోవాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. పవన్ చేపడుతున్నది వారాహి యాత్ర కాదని, నారాహి యాత్ర అని వ్యంగ్యం ప్రదర్శించారు. పవన్ కల్యాణ్ ఓ సినీ స్టార్ అయినప్పటికీ జనాలు రావడం లేదని తెలిపారు. 

ఈ  సందర్శంగా కేఏ పాల్... టీడీపీ అధినేత చంద్రబాబుపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పులివెందులలో రూ.50 కోట్లు ఖర్చు చేసి తాను పులిని అని చెప్పుకుంటున్నాడని విమర్శించారు. వారాహి యాత్రకు వెళ్లినవారికి రూ.500 ఇస్తే, చంద్రబాబు సభలకు వెళ్లిన వారికి రూ.1000 ఇస్తున్నారని కేఏ పాల్ ఆరోపించారు.


More Telugu News