పోలీసుల సమక్షంలో ప్రతిపక్షంపై దాడులు చేసి బంద్ చేయడం వైసీపీకే చెల్లింది: నారా లోకేశ్
- నిన్న అంగళ్లు, పుంగనూరుల్లో హింసాత్మక ఘటనలు
- నేడు బంద్ కు పిలుపునిచ్చిన వైసీపీ
- చిత్తూరులో అమరరాజా కంపెనీ బస్సు ధ్వంసం
- ఆగ్రహం వ్యక్తం చేసిన నారా లోకేశ్
టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన నేపథ్యంలో నిన్న అన్నమయ్య జిల్లా అంగళ్లు, చిత్తూరు జిల్లా పుంగనూరులో హింసాత్మక ఘటనలు జరగడం తెలిసిందే. దీనిపై నేడు చిత్తూరు జిల్లా బంద్ కు వైసీపీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా జరిగిన పరిణామాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. బంద్ పేరుతో వైసీపీ దాడులు చేయడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు.
సైకో జగన్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని పేర్కొన్నారు. పోలీసులు చూస్తుండగా ప్రతిపక్షంపై దాడులు చేసి బంద్ చేయడం వైసీపీకే చెల్లిందని లోకేశ్ విమర్శించారు. చిత్తూరులో అమరరాజా కంపెనీ బస్సును ధ్వంసం చేసి, ఆ సంస్థ ఉద్యోగులపై దాడి చేశారని ఆరోపించారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులు ఎక్కడ అని ప్రశ్నించారు.