పంత్ ప్రాక్టీస్ మామూలుగా లేదుగా.. 140 కి.మీ వేగంతో వచ్చే బంతులతో బ్యాటింగ్
- 8 నెలల కిందట రోడ్డు ప్రమాదానికి గురైన రిషభ్ పంత్
- కోలుకుని.. గత నెలలో బ్యాటింగ్ ప్రాక్టీస్ షురూ
- అంతర్జాతీయ క్రికెట్ ప్రమాణాలను అందుకునేలా ప్రాక్టీస్
8 నెలల కిందట రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్. తీవ్రంగా గాయపడినా ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. పూర్తిగా కోలుకుని గత నెల నుంచి క్రికెట్ ప్రాక్టీస్‌ను కూడా మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని బీసీసీఐనే వెల్లడించింది.
ఈ నేపథ్యంలో రిషభ్ పంత్ ప్రాక్టీస్‌కు సంబంధించిన మరో అప్‌డేట్ వచ్చింది. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో పంత్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అదీ కూడా సాదా సీదాగా కాదు.. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో వచ్చే బంతులను పంత్ ఎదుర్కోగలుగుతున్నాడట. ఈ విషయాన్ని క్రీడల వార్తా సంస్థ ఒకటి వెల్లడించింది.
టీమిండియాలోకి మళ్లీ ఎంట్రీ ఇవ్వాలంటే.. అంతర్జాతీయ క్రికెట్ ప్రమాణాలను పంత్ అందుకోవాల్సిందే. అందుకే వేగవంతమైన బంతులను ఎదుర్కొంటూ.. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడట. దీంతో పంత్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. లెజెండ్ తిరిగి వస్తాడని అనుకుంటున్నానంటూ ఓ ఫ్యాన్ కామెంట్ చేశాడు.