ఇది ఉల్టా స్కూటర్.. చూడాలనుందా..?.. వీడియో ఇదిగో
- స్కూటర్ సీటు కింది భాగంలో హ్యాండిల్
- స్కూటర్ ముందు భాగంలో ఖాళీ ప్రదేశంలో కూర్చోవడం
- ఈ వింత చూడాలంటే ఇండోనేషియా కి వెళ్లాల్సిందే
ఓ యువకుడు తన స్కూటర్ ను ఉల్టా స్కూటర్ గా మార్చేశాడు. సృజనాత్మకత ఉంటే ఏదైనా చేయవచ్చని నిరూపించాడు. సాధారణంగా ద్విచక్ర వాహనాల రూపురేఖల్లో కొందరు కొన్ని మార్పులు చేసుకుని తిరుగుతుంటారు. చట్టపరంగా అయితే వాహనాల్లో ఆల్టరేషన్ ను అనుమతించరు. కానీ, ఇక్కడ మీరు చూస్తున్న స్కూటర్ లో చెప్పుకోవడానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
ఇది పూర్తిగా వెరైటీ. సాధారణంగా వాహనం ఏదైనా కానీ, డ్రైవ్ చేస్తుంటే ముందుకు వెళుతుంది. కానీ, ఈ స్కూటర్ వెనక్కి వెళుతుంది. ఎందుకంటే నడపాల్సిన హ్యాండిల్ ను తీసుకెళ్లి సీటు కింది భాగంలో అమర్చాడు. స్కూటర్ కు ముందు భాగంలో కొంత ఖాళీ స్పేస్ ఉంటుంది కదా. అక్కడ కూర్చుని హ్యాండిల్ ను బ్యాలన్స్ చేసుకుంటూ స్కూటర్ పై వెనక్కి సాగిపోతున్నాడు. ఈ వీడియో ఇన్ స్టా గ్రామ్ పైకి చేరడంతో, యూజర్లు ఎంతో ఆశ్చర్యంగా చూస్తున్నారు.
ఇంతకీ ఇది మన ఇండియాలో మాత్రం కాదు, ఇండోనేషియాలో. అరఫ్ అబ్దురెహమాన్ దీని రూపకర్త. దీనిపై అతడు స్వారీ చేస్తుండగా, దారిన పోయే ప్రతి ఒక్కరూ అతడి వైపు, అతడు నడుపుతున్న స్కూటర్ వైపు నోరెళ్లబెట్టి చూస్తున్నారు. (వీడియో కోసం)