సుప్రీంలో ఊరట లభించిన నేపథ్యంలో.. లాలూను కలిసిన రాహుల్ గాంధీ!

  • రాహుల్ గాంధీకి జైలుశిక్షపై సుప్రీంకోర్టు స్టే 
  • మీసా భారతి నివాసంలో నిన్న లాలూను కలిసిన రాహుల్
  • భేటీలో పాల్గొన్న కేసీ వేణుగోపాల్, తేజస్వి యాదవ్
పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు నిన్న ఊరటను కల్పించిన సంగతి తెలిసిందే. సూరత్ కోర్టు ఆయనకు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో, ఎంపీగా ఆయన మళ్లీ పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరైన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను నిన్న రాహుల్ గాంధీ కలిశారు. 

ఆర్జేడీ ఎంపీ, లాలూ కుమార్తె మీసా భారతి నివాసంలో వీరు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లాలూను రాహుల్ గాంధీ ఆప్యాయంగా హత్తుకున్నారు. ఈ భేటీలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కూడా పాల్గొన్నారు. భేటీ సందర్భంగా పలు విషయాలపై వీరు చర్చించారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. 


More Telugu News