సింగర్ చిన్మయి శ్రీపాద చుట్టూ మరో కాంట్రవర్సీ
- ఇండియాను వీడటం తన కల అని చెప్పిన ఎన్నారై యువతి
- యువతికి మద్దతుగా ట్వీట్ చేసిన సింగర్ చిన్మయిపై ట్రోలింగ్
- నెటిజన్లకు దీటుగా రిప్లై ఇచ్చిన సింగర్
సింగర్ చిన్మయి శ్రీపాద తాజాగా చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ నెటిజన్ల ట్రోలింగ్‌కు చిన్మయి దీటుగా జవాబిస్తున్నారు. ఇండియాను వీడటమే తన కల అన్న ఓ ఎన్నారై యువతికి మద్దతుగా చిన్మయి ట్వీట్ చేయడంతో కాంట్రవర్సీ మొదలైంది.
కెనడాలో చదువుకుంటున్న ఓ భారతీయ యువతి వీడియో ఇటీవల నెట్టింట్లో వైరల్‌గా మారింది. కెనడాకు ఎందుకు వచ్చారు? అని వీడియోలో ఇంటర్వ్యూవర్ తొలుత ఆమెను ప్రశ్నించారు. యువతి జవాబిస్తూ.. ఇండియాను వీడటమే తన కల అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. కెనడాలో మీకు నచ్చింది ఏంటని అడగ్గా ఇక్కడ స్వేచ్ఛగా ఉండొచ్చని ఆమె చెప్పుకొచ్చింది.
అయితే, ఈ వీడియోపై స్పందించిన చిన్మయి ఆ యువతికి మద్దతుగా నిలిచింది. ‘‘పరాయి దేశంలో కూడా ఆమె స్వేచ్ఛగా ఉండగలుగుతోంది. ఆమె చెప్పేదేంటో వింటే విషయం పూర్తిగా బోధపడుతుంది. ఆమె ఇండియా విడిచి వెళ్లగలిగినందుకు నాకెంతో హ్యాపీగా అనిపించింది. ఇక్కడి స్త్రీలందరూ ఇలాగే సురక్షితమైన ప్రదేశాలకు వెళ్లిపోగలిగితే బాగుండును’’ అని ట్వీట్ చేశారు.
మాతృదేశాన్ని కాదనుకున్న యువతికి చిన్మయి మద్దతు ఇవ్వడం అసలేమాత్రం నచ్చని నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగారు. ‘‘నువ్వింకా దేశంలోనే ఉన్నావంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. బహుశా డబ్బులు పోగేసుకునేందుకు ఉన్నావేమో. ఇక్కడ మాత్రం వ్యక్తిగత భద్రతకంటే సంపాదనవైపే మొగ్గు చూపావేమో’’ అని ఓ నెటిజన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
చిన్మయి శ్రీపాద కూడా ఘాటుగా స్పందించింది. ‘‘మంచి కెరీర్, డబ్బు సంపాదిస్తున్న వారిని చూసి నీ ఇగో హర్ట్ అయింది. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. నువ్వు, ట్విట్టర్ కనుమరుగయ్యాక కూడా నేను పాడిన పాటలు వినిపిస్తూనే ఉంటాయి. కానీ నీ విషయంలో అలా కాదు. భద్రత లేమి కారణంగా ఇండియా వీడానని ఓ మహిళ అంటే ఇలా స్పందిస్తారా? అసలు ఇండియాను వీడి వెళ్లాల్సింది నువ్వే’’ అంటు ఘాటుగా బదులిచ్చింది చిన్మయి శ్రీపాద.