బ్రిటన్‌లో వేగంగా వ్యాప్తిచెందుతున్న కొవిడ్ కొత్త వేరియంట్
- ఒమిక్రాన్ నుంచి పుట్టుకొచ్చిన ‘ఈజీ.5.1’
- కొత్త కేసుల్లో 14.6 శాతం అవే
- అప్రమత్తంగా ఉండాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
కరోనా వైరస్‌లో కొత్తరకం వేరియంట్ ఇప్పుడు బ్రిటన్‌ను వణికిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ నుంచి పుట్టుకొచ్చిన ‘ఈజీ5.1’ (ఎరిస్) అనే ఈ కొత్త రకం వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతూ జనాన్ని భయపెడుతోంది. దేశంలో కొత్తగా నమోదవుతున్న కొవిడ్ కేసుల్లో దీనివాటా 14.6 శాతంగా ఉన్నట్టు అక్కడి ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.
బ్రిటన్‌లోనే కాదు అంతర్జాతీయంగానూ ఈ కేసులు పెరుగుతున్నట్టు చెబుతున్నారు. కరోనా టీకాలు తీసుకున్నా, ఒకసారి కరోనా బారినపడి కోలుకున్నా కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. అయితే, ఈ వేరియంట్‌తో తీవ్ర ఇన్ఫెక్షన్ వస్తుందన్న సూచనలు కనిపించలేదని పేర్కొంది.