మొసలికి ఆహారంగా మారిన ఫుట్ బాల్ ఆటగాడు... వీడియో ఇదిగో!
- కోస్టారికా ఫుట్ బాల్ రంగంలో విషాదం
- వ్యాయామం సందర్భంగా నదిలో దూకిన ఆటగాడు
- వెంటనే నోటకరుచుకుని లాక్కెళ్లిన భారీ మొసలి
- తుపాకులతో వేటాడి మొసలిని అంతమొందించిన పోలీసులు
కోస్టారికా దేశం ఫుట్ బాల్ రంగంలో విషాదం నెలకొంది. ఓ ఫుట్ బాల్ క్రీడాకారుడు మొసలికి బలయ్యాడు. ఆ సాకర్ ఆటగాడి పేరు జీసస్ ఆల్బర్టో లోపెజ్ ఆర్టిజ్. ఆర్టిజ్ అవశేషాలను అధికారులు అతికష్టమ్మీద వెలికి తీశారు. ఆ మొసలిని చంపడానికి స్థానిక పోలీసులు తుపాకులు ఉపయోగించాల్సి వచ్చింది.
కోస్టారికా రాజధాని శాన్ జోస్ కు 140 మైళ్ల దూరంలోని శాంటాక్రజ్ అనే పట్టణం వద్ద ఈ ఘటన జరిగింది. ఆర్టిజ్ మూసివేసి ఉన్న ఓ ఫిషింగ్ బ్రిడ్జి పైనుంచి కనాస్ నదిలో దూకగా, ఓ పెద్ద మొసలి అతడిని నోటకరుచుకుని లాక్కెళ్లడం చూపరులకు ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది.
వ్యాయామం చేస్తున్న సమయంలో ఆర్టిజ్ నదిలో దూకాడు. అయితే ఆ నది మొసళ్లకు ఆవాసం అని తెలిసి కూడా అతడు దూకడం వెనుక కారణాలు ఏంటన్నది తెలియరాలేదు. 29 ఏళ్ల ఆర్టిజ్ డిపోర్టివో రియో కనాస్ అనే ఫుట్ బాల్ క్లబ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.