ఏం జరిగినా నా దారి క్లియర్.. నా పనిపై నాకు స్పష్టత ఉంది: రాహుల్ గాంధీ
- ఏది వచ్చినా తన కర్తవ్యం ఇలాగే ఉంటుందంటూ ట్వీట్
- ఈ రోజు కాకపోయినా రేపైనా నిజం గెలుస్తుందని వ్యాఖ్య
- మద్దతు తెలిపిన, ప్రేమ చూపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన కాంగ్రెస్ నేత
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో శుక్రవారం భారీ ఊరట లభించింది. రెండేళ్ల జైలు శిక్షపై స్టే విధిస్తూ సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ తీర్పుపై రాహుల్ గాంధీ స్పందించారు. ఏది వచ్చినా.. తన కర్తవ్యం ఇలాగే ఉంటుందని, భారత ఆలోచనను రక్షించడమే తన ఉద్దేశ్యమని ట్వీట్ చేశారు.
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ రోజు కాకుంటే రేపు అయినా నిజం గెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఏం జరిగినా నా దారి క్లియర్‌గా ఉందన్నారు. తానేం చేయాలనే అంశంపై తనకు పూర్తి స్పష్టత ఉందన్నారు. తనకు మద్దతు తెలిపిన వారికి, ప్రేమ చూపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఈ తీర్పుపై స్పందించారు. సత్యం ఒకటే గెలుస్తుందని ఖర్గే పేర్కొన్నారు. ఎట్టకేలకు న్యాయం జరిగిందని, ప్రజాస్వామ్యం నెగ్గిందన్నారు. రాహుల్‌ను బీజేపీ వేటాడటం పూర్తిగా బహిర్గతమైందన్నారు. విపక్షాలను లక్ష్యంగా చేసుకునే దుర్మార్గపు ఆలోచనలను ఆపేయాలని సూచిస్తూ ట్వీట్ చేశారు.