దుబాయ్‌లో నంది అవార్డుల వేడుకతో మాకు సంబంధం లేదు: తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి స్పష్టీకరణ

  • వచ్చే నెలలో దుబాయ్ వేదికగా నంది అవార్డుల వేడుక
  • ఈ అవార్డుల వేడుక రామకృష్ణగౌడ్ వ్యక్తిగతమని వెల్లడి 
  • ఈ అవార్డు వేడుకలపై విచారణ జరపాలని తెలుగు రాష్ట్రాల మంత్రులకు విజ్ఞప్తి
దుబాయ్‌లో జరగనున్న నంది అవార్డుల వేడుకపై తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (టీఎఫ్‌సీసీ) శుక్రవారం కీలక ప్రకటన చేసింది. వచ్చే నెలలో దుబాయ్ వేదికగా నంది అవార్డుల ఫంక్షన్‌ను ప్రకటించారు. అయితే ఇక్కడ నిర్వహించే ఈ కార్యక్రమంతో ఫిల్మ్ ఛాంబర్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇది రామకృష్ణగౌడ్ వ్యక్తిగతమని స్పష్టం చేసింది.

తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు ప్రభుత్వ అనుమతి లేదని వెల్లడించింది. దీనిని ఓ ప్రయివేటు సంస్థగా తెలిపింది. ఒక వ్యక్తి ఇలా నంది అవార్డులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది. ఈ అవార్డుల పేటెంట్ ఆంధ్రప్రదేశ్ పేరు మీద ఉందని గుర్తు చేసింది. దుబాయ్‌లో జరగనున్న ఈ అవార్డు వేడుకలపై ఉభయ తెలుగు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులు విచారణ జరపాలని టీఎఫ్‌సీసీ విజ్ఞప్తి చేసింది.


More Telugu News