ఎన్నికలప్పుడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లంతా టీడీపీకే ఓటు వేస్తారు: ఏపీ మంత్రి అప్పలరాజు
- మనవి కాని ఓట్లపై అభ్యంతరం వ్యక్తం చేయాలని కార్యకర్తలకు సూచించిన అప్పలరాజు
- ఇతర ప్రాంతాల్లో ఉండే ఓటర్లను గుర్తించాలని సూచన
- పలాసలో కార్యకర్తల సమావేశంలో కీలక వ్యాఖ్యలు
ఏపీ మంత్రి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్ల వెరిఫికేషన్ కు ఎన్నికల అధికారులు వచ్చినప్పుడు ఆ ఓట్లు మనవి కావు అనుకుంటే వాటిపై అభ్యంతరం వ్యక్తం చేయాలని వైసీపీ కార్యకర్తలకు సూచించారు. ఇతర ప్రాంతాల్లో ఉండేవారు మనకు ఓట్లు వేయరని, అలాంటి వారిని గుర్తించాలని చెప్పారు. వీళ్లంతా ఎక్కడో ఉంటారని, ఎన్నికలప్పుడు వచ్చి టీడీపీకి ఓటు వేస్తారని అన్నారు.
ఇలాంటి ఓటర్లను గుర్తించి ఫామ్-7 రైజ్ చేయాలని సూచించారు. టీడీపీకి ఓట్లు వేసే వారి ఓట్లను తొలగించేలా పని చేయాలని చెప్పారు. పలాసలో పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అప్పలరాజు వ్యాఖ్యలపై విపక్ష శ్రేణులు మండిపడుతున్నాయి.