జమ్మూ కశ్మీర్ భారత్ లో కలవడానికి కారణం ఆయనే..: ఫరూక్ అబ్దుల్లా
- ఢిల్లీలో జరిగిన ఓ సదస్సులో నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ వ్యాఖ్యలు
- మహాత్ముడి మాట వల్లే పాకిస్థాన్ కు దూరంగా ఉన్నట్లు వెల్లడి
- జమ్మూ కశ్మీర్ లో ఎన్నికలు జరపాలంటూ డిమాండ్
జమ్మూ కశ్మీర్ స్వతంత్ర రాజ్యంగానే ఉండాలని భావించలేదని, అయితే భారత్ లో కలిసిపోవడానికి మహాత్ముడి మాటే కారణమని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. దేశ విభజన తర్వాత చోటుచేసుకున్న ఘటనలను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్ లో ప్రస్తుతం సాధారణ పరిస్థితి నెలకొందని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని గుర్తుచేశారు. సాధారణ పరిస్థితి నెలకొంటే ఎన్నికలు ఎందుకు నిర్వహించడంలేదని కేంద్రాన్ని నిలదీశారు. గురువారం ఢిల్లీలో జరిగిన ఓ సదస్సులో జమ్మూ కశ్మీర్ అంశంపై ఫరూక్ అబ్దుల్లా మాట్లాడారు.
ముస్లింలు ఎక్కువగా ఉన్న రాష్ట్రమే అయినా దేశ విభజన జరిగినపుడు భారత్ లోనే ఉండేందుకు జమ్మూ కశ్మీర్ ప్రజలు మొగ్గుచూపారని ఫరూక్ అబ్దుల్లా వివరించారు. జమ్మూ కశ్మీర్ లో ఇప్పటి వరకూ ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదని చెప్పారు. కాగా, ఈ సదస్సులో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎంపీలు కనిమొళి, సుప్రియా సూలే, శశిథరూర్, మనోజ్ ఝా తదితరులు పాల్గొన్నారు. జమ్మూ కశ్మీర్ లో వెంటనే ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.