తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. కేసీఆర్ పై ప్రశంసలు కురిపించిన కేటీఆర్
- దేశ ఐటీ కన్నా తెలంగాణ ఐటీ రంగ పురోగతి నాలుగు రెట్లు ఎక్కువగా ఉందన్న కేటీఆర్
- దక్షత కలిగిన నాయకుడు కేసీఆర్ వల్లే ఇది సాధ్యమయిందని కితాబు
- రాష్ట్రం ఏర్పడిన తర్వాత 6 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చాయని వెల్లడి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ స్పీకర్ తొలుత ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సందర్భంగా ఐటీ ఎగుమతులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానమిస్తూ... తెలంగాణ నుంచి ఐటీ ఎగుమతులు భారీగా పెరుగుతున్నాయని చెప్పారు. మన రాష్ట్రంలో కులాల మధ్య కొట్లాట, మతాల పంచాయతీ లేదని అన్నారు. దేశంలో ఐటీ ఎదుగుదలను చూస్తే.. మన రాష్ట్ర ఐటీ పురోగతి నాలుగు రెట్లు ఎక్కువగా ఉందని చెప్పారు. దమ్మున్న, దక్షత కలిగిన నాయకుడు కేసీఆర్ ఉండటం వల్లే ఇందంతా సాధ్యమయిందని కొనియాడారు. ఏబుల్ లీడర్ షిప్, స్టేబుల్ గవర్నమెంట్ ఉండలం వల్లే దీన్ని సాధించామని చెప్పారు.
ఒప్పుడు ఉన్నత స్థానంలో ఉన్న గురుగ్రామ్ లో ఐటీ పరిశ్రమను నాశనం చేసేశారని కేటీఆర్ విమర్శించారు. 1987లో హైదరాబాద్ లోని బేగంపేటలో తొలి ఐటీ టవర్ వచ్చిందని... ఆ తర్వాత 27 ఏళ్లలో ఐటీ ఎగుమతుల మొత్తం రూ. 56 వేల కోట్లు మాత్రమే కాగా, గత ఏడాది ఐటీ రంగ ఎగుమతులు రూ. 57,707 కోట్లుగా ఉన్నాయని చెప్పారు. అంటే 27 ఏళ్లలో జరిగింది ఒక్క ఏడాదిలోనే కేసీఆర్ చేసి చూపించారని కొనియాడారు. ప్రపంచంలోని ప్రముఖ ఐటీ కంపెనీలన్నీ హైదరాబాద్ కు వస్తున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 6 లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. రాష్ట్రంలో భూముల ధరలు కూడా భారీగా పెరిగాయని... ఈరోజు ఎకరం భూమి రూ. 100 కోట్లు పలుకుతోందని అన్నారు.