చైనాకు చుక్కలు చూపించిన భారత హాకీ జట్టు

  • చెన్నైలో ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ
  • తన తొలి మ్యాచ్ లో చైనాను ఢీకొన్న భారత్
  • గోల్స్ వర్షం కురిపించిన భారత ఆటగాళ్లు
  • 7-2తో చైనాను మట్టి కరిపించిన భారత్
చెన్నైలో ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ-2023 హాకీ ఈవెంట్ నేడు ఘనంగా ప్రారంభమైంది. ఆతిథ్య భారత్ ఈ టోర్నీలో తన ప్రస్థానాన్ని ఘనంగా ఆరంభించింది. తన తొలి మ్యాచ్ లో 7-2 భారీ తేడాతో చైనాను మట్టి కరిపించింది. 

భారత్ తరఫున కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ 2, వరుణ్ కుమార్ 2, అక్షదీప్ సింగ్ 1, సుఖ్ జీత్ సింగ్ 1, మన్ దీప్ సింగ్ 1 గోల్ సాధించారు. చైనా తరఫున జీషెంగ్ గావో, వెన్ హుయి గోల్స్ చేశారు. 

ఈ మ్యాచ్ లో భారత్ గోల్స్ వర్షం కురిపించగా, చైనా ఆటగాళ్లు ప్రేక్షక పాత్ర వహించారు. చైనా చేసిన రెండు గోల్స్ కూడా భారత ఆటగాళ్ల తప్పిదాల వల్లే వచ్చాయి. 

భారత జట్టు మ్యాచ్ మొదలైన 5వ నిమిషం నుంచే గోల్స్ వేట షురూ చేసింది. అయితే మ్యాచ్ ప్రథమార్థం ముగిసేసరికి స్కోరు 6-2 కాగా... ద్వితీయార్థంలో ఒక్క గోల్ మాత్రమే వచ్చింది.


More Telugu News