ఢిల్లీ సర్వీసెస్ సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం

  • ఢిల్లీలో చట్టాలు చేసేలా కేంద్రానికి అధికారం
  • ఢిల్లీ సర్వీసెస్ ఆర్డినెన్స్ కు సవరణ
  • మంగళవారం నాడు లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టిన అమిత్ షా
  • నేడు వాడీవేడిగా చర్చ
  • అమిత్ షా ప్రసంగాన్ని వ్యతిరేకించిన విపక్షాలు... సభ నుంచి వాకౌట్
ఢిల్లీలో చట్టాలు చేసే అధికారం కేంద్రానికి కల్పించే ఢిల్లీ సర్వీసెస్ సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. జీఎన్టీసీ (గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ) సవరణ బిల్లును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మంగళవారం నాడు లోక్ సభలో ప్రవేశపెట్టడం తెలిసిందే. నిన్న సభ వాయిదాపడడంతో ఈ బిల్లుపై ఇవాళ వాడీవేడిగా చర్చ కొనసాగింది. 

హోంమంత్రి అమిత్ షా చర్చలో భాగంగా ప్రసంగిస్తున్న సమయంలో విపక్ష సభ్యులు నిరసనలు తెలిపారు. కొద్దిసేపటి కిందట ఈ బిల్లుపై ఓటింగ్ నిర్వహించగా విపక్షాలు వాకౌట్ చేశాయి. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల బలంతో కేంద్రం ఈ బిల్లును ఆమోదింపజేసుకుంది.


More Telugu News