ఆ సినిమా సమయంలో దాసరిపై ఎస్వీఆర్ కోప్పడ్డారట!
- 'తాత - మనవడు'తో హిట్ కొట్టిన దాసరి
- రెండో సినిమాగా 'సంసారం సాగరం'
- డైలాగ్స్ విషయంలో అభ్యంతరం చెప్పిన ఎస్వీఆర్
- ఆ తరువాత దాసరిని అర్థం చేసుకున్నారంటూ వెల్లడి
దాసరి నారాయణరావు రచయితగా .. దర్శకుడిగా .. నటుడిగా తన ప్రతిభను చాటుకున్నారు. దాసరి నారాయణరావుకి సన్నిహితుడైన దర్శకుడు నందం హరిశ్చంద్రరావు ఆయన గురించిన విషయాలను తాజాగా ఒక యూ ట్యూబ్ ఛానల్ తో పంచుకున్నారు. "దాసరిగారు ఎంతో కష్టపడి అంచలంచెలుగా ఎదుగుతూ వెళ్లారు. అలాంటి ఆయనపై ఒకసారి ఎస్వీఆర్ గారికి కోపం వచ్చింది" అని అన్నారు.
'తాత - మనవడు' హిట్ తరువాత దాసరిగారు 'సంసారం సాగరం' అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. రాఘవరావు గారు నిర్మిస్తున్న ఆ సినిమా షూటింగు నడుస్తోంది. ఎస్వీ రంగారావుకి సంబంధించిన ఒక సీన్ ను చిత్రీకరించవలసి ఉంది. అది చాలా ఎమోషన్స్ తో కూడిన సీన్. దాసరి గారు 10 పేజీల డైలాగ్స్ రాశారు. అన్ని డైలాగ్స్ అవసరం లేదంటూ ఎస్వీఆర్ గారు 4 పేజీల డైలాగ్స్ కట్ చేశారు.
"ఆ డైలాగ్స్ ను కట్ చేయడం కుదరదని దాసరిగారు అన్నారు .. అలా అయితే ఆ సినిమా చేయవలసిన అవసరం తనకి లేదంటూ కోపంగా విగ్గు తీసేసి రంగారావుగారు కారులో వెళ్లిపోయారు. నిర్మాత రాఘవరావుగారు కంగారు పడిపోయారు. ఎస్వీఆర్ వెనక్కి తిరిగి వస్తారని చెప్పి దాసరి అక్కడే కూర్చున్నారు. కొంత దూరం వెళ్లిన ఎస్వీఆర్ గారు తాను చేసింది కరెక్టు కాదని భావించి నిజంగానే వెనక్కి వచ్చేశారు" అని చెప్పుకొచ్చారు.