ఫుడ్ ప్యాకెట్ పై ఎక్స్ పైరీ డేట్ కాదు చూడాల్సింది..!
- తయారీ డేట్ కూడా ఎంతో ముఖ్యం
- ఎక్కువ గడువు ఉన్నవే తీసుకోవాలి
- తాజా ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలి
- గడువు ముగిసిపోవడం సమీపిస్తే నాణ్యత లోపించినట్టే
మనలో చాలా మంది ఏదైనా ఫుడ్ ప్యాకెట్ కొనుగోలు చేసినప్పుడు దానిపై ఎక్స్ పైరీ గడువు ఏంటన్నది చూస్తుంటాం. కానీ ఇదొక్కటే కాదు చూడాల్సింది. దాని తయారీ ఎప్పుడన్నది కూడా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే కంటామినేటెడ్ ఫుడ్స్ తో ఇన్ఫెక్షన్ల రిస్క్ ఉంటుంది.
యూజ్ బిఫోర్, బెస్ట్ బిఫోర్ అని డేట్ ముద్రించి ఉంటుంది. దీనికి బదులు మ్యానుఫాక్చరింగ్ (ఎంఎఫ్ జీ) డేట్, తయారీ డేట్ ను చూడాలి. వీలైనంత తాజా ఉత్పత్తిని తీసుకుని వినియోగించడం అన్నింటికంటే మేలైనది. మరి యూజ్ బిఫోర్ అనే డేట్ దాటితే తినకూడదా? అలాంటి వాటితో ప్రమాదాలు వస్తాయా? అంటే కచ్చితంగా అవునని సమాధానం చెప్పలేం. ఉదాహరణకు యుగర్ట్ కానీ, పాలు, పెరుగు కానీ వాటిపై ప్రకటించిన తేదీ మరుసటి రోజు వాడుకున్నా ఏమీ కాదు. కానీ, అన్ని సందర్భాల్లో ఏమీ కాదని చెప్పలేం. అందుకనే సాధ్యమైన మేర తాజా ఉత్పత్తులను వినియోగించుకోవడం వినియోగదారుల ముందున్న ఆప్షన్లలో ఉత్తమమైనది.
పసి పిల్లలకు వాడే ఇన్ ఫాంట్ ప్రొడక్టులను మాత్రం గడువు దాటిన తర్వాత వినియోగించొద్దు. చాలా వరకు ఆహార ఉత్పత్తులపై ముద్రించే యూజ్ బిఫోర్, బెస్ట్ బిఫోర్ అనేవి కేవలం సూచనలే. ఆ గడువు దాటిన తర్వాత కూడా కొంత సమయం పాటు అవి పాడు కావు. అలా అని వాటిని వాడుకోవడం సూచనీయం కూడా కాదు. కచ్చితంగా గడువు దగ్గర పడుతున్న ఉత్పత్తుల్లో నాణ్యత తగ్గిపోతున్నట్టు అర్థం చేసుకోవాలి. అందుకనే ఇంకొన్ని రోజులు గడువు ఉంది కదా అని సర్దుకుపోయే బదులు, తయారీ అయి వెంటనే వచ్చే తాజా ఉత్పత్తులను వినియోగించుకోవడం అన్ని విధాలా మేలు.