దేశంలో ఎక్కువ మందికి చేరువ అయిన కారు ఇదే..!

  • 45 లక్షల మందికి సొంతమైన మారుతి ఆల్టో
  • 2000లో ఈ కారు భారత మార్కెట్లో విడుదల
  • ప్రస్తుతం ఆల్టో కే10 పేరుతో విక్రయాలు
మన దేశంలో ప్యాసింజర్ కార్ల విభాగంలో మారుతి సుజుకీ నంబర్ 1 కంపెనీగా ఎప్పటి నుంచో రాణిస్తోంది. మరి మన దేశంలో ఎక్కువ మంది మెచ్చిన కారు ఏంటని అనుకుంటున్నారు? అది మారుతి ఆల్టో. చిన్న సైజు కారు కావడంతో పట్టణాల్లో ప్రయాణానికి ఎంతో అనుకూలంగా ఉండే ఈ కారును ఎక్కువ మంది కొనుగోలు చేస్తుంటారు. ఇటీవలి కాలంలో పోటీ కారణంగా ఎన్నో మోడళ్లు అందుబాటులోకి రావడంతో ఆల్టో కార్లు తగ్గిపోయాయి. కానీ, కొన్నేళ్ల క్రితం వరకు రోడ్లపై పరుగులు తీసే కార్లలో మారుతి ఆల్టోనే ఎక్కువగా కనిపించేది. 

2000 సంవత్సరంలో మారుతి ఆల్టో విడుదలైంది. 2004 నాటికి అత్యధికంగా అమ్ముడుపోయే కారుగా పేరు తెచ్చుకుంది. ఇందులో మైలేజీ కూడా మెరుగ్గా ఉంటుంది. నలుగురు సభ్యుల కుటుంబానికి చక్కగా సరిపోతుంది. ప్రస్తుతం మారుతి ఆల్టో కే10 రూపంలో అందుబాటులో ఉంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.3.99 లక్షల నుంచి రూ.5.96 లక్షల మధ్య ఉంది. ఎంపిక చేసుకున్న వేరియంట్ ఆధారంగా ధర ఉంటుంది. విడుదలైన తర్వాత 23 ఏళ్ల కాలంలో 45 లక్షల ఆల్టో కార్లను మారుతి విక్రయించింది. తక్కువ ధర, నమ్మకమైన పనితీరు, మెరుగైన మైలేజ్ దీని ప్రత్యేకతలు.


More Telugu News