రూ.25 వేల లోపు టాప్ రేటెడ్ స్మార్ట్ ఫోన్లు ఇవే

  • డిజైన్ కోసం అయితే 'లావా అగ్ని 2' 5జీ
  • ల్యాగ్ ఫ్రీ కోరుకుంటే వన్ ప్లస్ నార్డ్ 
  • అన్నింటి సమన్వయంతో గెలాక్సీ ఎం33 5జీ
4జీ కంటే సూపర్ ఫాస్ట్ టెక్నాలజీ అయిన 5జీ వినియోగం క్రమంగా పెరుగుతోంది. ప్రముఖ పెద్ద పట్టణాల్లో ఇప్పటికే 5జీ సేవలు వచ్చేశాయి. దీంతో ఇక మీదట స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే వారు ఎవరైనా కానీ, 4జీకి బదులు 5జీ ఫోన్ తీసుకోవడమే సరైనది. ఎందుకంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు 5జీ సేవల్లోకి మారిపోవచ్చు. రూ.25వేల లోపు బడ్జెట్ లో అందుబాటులో ఉన్న మంచి రేటెడ్ 5జీ స్మార్ట్ ఫోన్ల వివరాలు ఇవి..

శామ్ సంగ్ గెలాక్సీ ఎం33 5జీ
చూడ్డానికి సింపుల్ డిజైన్ తో ఉంటుంది. ఇందులో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, అమోలెడ్ డిస్ ప్లే ప్రత్యేక ఆకర్షణలు. ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. 5ఎన్ఎం ఎక్సినోస్ 1280 చిప్ సెట్ ను ఇందులో వినియోగించారు. ఇది శామ్ సంగ్ సొంత చిప్ సెట్. 120 హెర్జ్ రీఫ్రెష్ రేట్, అమోలెడ్ డిస్ ప్లేతో వస్తుంది. యూఐ కూడా క్లీన్ గా ఉంటుంది. 6జీబీ ర్యామ్, 128జీబీ వెర్షన్ ధర రూ.15,499. 8జీబీ ర్యామ్, 128జీబీ వేరియంట్ ధర రూ.16,999. 

వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ
రూ.19,999 ధరలో వస్తున్న వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ ఫోన్, ఈ విభాగంలో మరో మంచి ఎంపిక అవుతుంది. 120 హెర్జ్ రీఫ్రెష్ రేటు, స్నాప్ డ్రాగన్ 695 చిప్ సెట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జర్ తో వస్తుంది. వన్ ప్లస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆక్సిజన్ ఓఎస్ 13.1 వెర్షన్ పై పనిచేస్తుంది. 8జీబీ ర్యామ్ తో సింగిల్ వేరియంట్ గా వస్తుంది. 

పోకో ఎక్స్ 5 ప్రో 5జీ
దీని డిజైన్, బిల్డ్ క్వాలిటీ మెప్పించే విధంగా ఉంటాయి. స్నాప్ డ్రాగన్ 778 చిప్ సెట్ తో వస్తుంది. ఈ చిప్ సెట్ మంచి పనితీరును అందిస్తుంది. మల్టీ టాస్క్ ను కూడా సాఫీగా చేసుకోవచ్చు. 120 హెర్జ్ రీఫ్రెష్ రేట్ తో కూడిన డిస్ ప్లే ఉంటుంది. స్టీరియో స్పీకర్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఐపీ53 రేటింగ్ తో వస్తుంది. దీని ధర రూ.25,000 వరకు ఉంది.

'లావా అగ్ని 2' 5జీ
దీని ధర రూ.22,000. అమెజాన్ సైట్ లో అందుబాటులో ఉంది. అన్నింటికంటే డిజైన్, పనితీరు, డిస్ ప్లే ఈ ఫోన్ ప్రత్యేకతలు. మీడియా టెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ తో వస్తుంది. 120 హెర్జ్ రీఫ్రెష్ రేటు, అమోలెడ్ డిస్ ప్లేతో వస్తుంది. కెమెరా పనితీరు కూడా బాగుంటుంది. యూజర్లు వీటిల్లో తమ బడ్జెట్, అవసరాలకు అనుగుణంగా నచ్చిన దాన్ని ఎంపిక చేసుకోవచ్చు.  



More Telugu News