ఇక సామర్లకోటలో కూడా వందే భారత్ ఆగుతుంది!

  • విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కు కొత్త హాల్టింగ్ 
  • విశాఖలో ఉదయం 5.45 గంటలకు బయలుదేరే రైలు 7.15 గంటలకు సామర్లకోటకు రాక
  • సికింద్రాబాద్ నుంచి బయలుదేరే రైలు రాత్రి 9.35 గంటలకు స్టేషన్‌కు చేరిక
  • కాకినాడ ప్రజల విజ్ఞప్తి మేరకు సామర్లకోటలో హాల్టింగ్ ఇచ్చినట్టు రైల్వే వెల్లడి
ఏపీ ప్రజలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సామర్లకోట స్టేషన్‌లో ఆగుతుందని పేర్కొంది. ఈ స్టేషన్‌లోనూ రైలుకు హాల్టింగ్ ఇచ్చినట్టు వెల్లడించింది. 

రైల్వే శాఖ ప్రకటన ప్రకారం, విశాఖలో ఉదయం 5.45 గంటలకు బయలుదేరే వందేభారత్‌ రైలు ఉదయం 7.15 గంటలకు సామర్లకోట స్టేషన్‌కు చేరుకుంటుంది. ఇక సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 3.00 గంటలకు బయలుదేరే రైలు రాత్రి 9.35 గంటల సమయంలో సామర్లకోట స్టేషన్‌కు చేరుతుంది. కాకినాడ జిల్లా వాసుల విజ్ఞప్తి మేరకు సామర్లకోట స్టేషన్‌లో వందేభారత్‌‌కు హాల్టింగ్ ఇచ్చినట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు.


More Telugu News