మాజీ మంత్రి తమ్ముడి భార్య వీడియో పెట్టి, ఏడ్చినా పవన్ కల్యాణ్ మాట్లాడరేం?: రోజా
- మహిళల రక్షణపై చంద్రబాబు, పవన్ మాట్లాడటం విడ్డూరమన్న మంత్రి
- నారాయణ తమ్ముడి భార్య వీడియోలు పెడితే పవన్ ఎందుకు స్పందించలేదని ప్రశ్న
- పవన్ కల్యాణ్ అభిమానిని అని ఆమె ఏడ్చినా మాట్లాడలేదని విమర్శ
- బాబు ఇచ్చే ప్యాకేజీ కోసం నోటికి ప్లాస్టర్ వేసుకున్నారా? అని నిలదీత
మహిళల రక్షణపై చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి ఆర్కే రోజా విమర్శలు గుప్పించారు. వీరిద్దరూ నిన్నటి వరకు వాలంటీర్ల మీద పడి ఏడ్చారని, కానీ ఇప్పుడు మాజీ మంత్రి నారాయణ తమ్ముడి భార్య కృష్ణప్రియ వీడియోలు పెడితే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తాను పవన్ అభిమానిని అని, తనకు న్యాయం చేయాలని అడిగిందని, కేసు కూడా పెట్టిందని, కానీ పవన్ నోరు మెదపడం లేదన్నారు. పవన్ అభిమానిని అని ఏడ్చినా పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు ఇచ్చే ఎన్నికల ఫండ్, ప్యాకేజీ కోసం నోటికి ప్లాస్టర్ వేసుకున్నారా? అని నిలదీశారు. నోరుందని షూటింగ్ గ్యాప్‌లో ఏది పడితే అది మాట్లాడవద్దన్నారు.
వారాహి అని అమ్మవారి పేరు పెట్టుకున్న వాహనంపై చెప్పులు వేసుకొని, తప్పుడు కూతలు కూస్తే మహిళలు ఊరుకోరని హెచ్చరించారు. జగన్ చాలా పారదర్శకంగా పాలన అందిస్తున్నారనే విషయం తెలుసుకోవాలన్నారు. ఫేస్ రికగ్నేజ్ ద్వారా ఇంటింటికి బాలింతలకు పోషకాహారం ఇస్తున్నామన్నారు. ఒక మహిళ డేటా తీసుకోవడం ద్వారానే ఇవన్నీ ఇవ్వగలమని పవన్ తెలుసుకోవాలన్నారు. చంద్రబాబుకు, ఆయన దత్త పుత్రుడికి చెడు ఆలోచనలు ఉన్నాయని, చెడు ఆలోచనలు ఉన్నవారికి చెడు బుద్ధులే ఉంటాయన్నారు.
జగన్ మాట్లాడేది తక్కువ.. పని చేసేది ఎక్కువ అన్నారు. దేశంలో ఎందరో ముఖ్యమంత్రులు ఉన్నారని, కొంతమంది మాకు విజన్ ఉందని డబ్బా కొట్టుకుంటారని, నలభై ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే వారిని చూశామని చంద్రబాబును ఉద్దేశించి విమర్శించారు. టీడీపీ పాలనలో గర్భిణీలు రక్తహీనతతో చనిపోయారని, జన్మభూమి కమిటీ పేర్లతో కోడిగుడ్లు, బియ్యం, పప్పు తినేశారన్నారు.