సునీల్ గవాస్కర్ భారత అత్యుత్తమ కెప్టెన్ కాదన్న శశి థరూర్

  • 'పిచ్ సైడ్: మై లైఫ్ ఇన్ ఇండియన్ క్రికెట్' పుస్తకాన్ని రచించిన అమృత్ మాధుర్
  • పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరైన శశి థరూర్
  • గవాస్కర్ కెప్టెన్సీపై వ్యాఖ్యలు
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కదిలే విజ్ఞాన భాండాగారం వంటి వ్యక్తి. ఆయనకు అనేక అంశాలపై, వివిధ రంగాలపై సునిశిత అవగాహన ఉంది. ముఖ్యంగా, ఆంగ్ల భాషపై ఆయనకున్న పట్టు అందరికీ తెలిసిందే. తాజాగా, శశి థరూర్ భారత క్రికెట్ రంగంపై స్పందించారు. తనకు తెలిసినంతవరకు భారత అత్యుత్తమ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కాదని అన్నారు. అలాగని అతడేమీ చెత్త కెప్టెన్ కాదని పేర్కొన్నారు. 

బీసీసీఐ మాజీ జనరల్ మేనేజర్ అమృత్ మాధుర్ రచించిన 'పిచ్ సైడ్: మై లైఫ్ ఇన్ ఇండియన్ క్రికెట్' అనే పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఎంపీ శశి థరూర్ హాజరయ్యారు. ఈ సందర్భంగానే ఆయన గవాస్కర్ సారథ్యం గురించి వ్యాఖ్యలు చేశారు. 

గవాస్కర్ 1975 నుంచి 1985 మధ్యకాలంలో భారత జట్టుకు 47 టెస్టుల్లో నాయకత్వం వహించగా... అతడి సారథ్యంలో భారత్ 9 మ్యాచ్ ల్లో గెలిచి 30 మ్యాచ్ లను డ్రా చేసుకుంది. 8 టెస్టుల్లో ఓడిపోయింది. గవాస్కర్ 37 వన్డేల్లోనూ భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించగా... 14 మ్యాచ్ ల్లో నెగ్గిన భారత్, 21 మ్యాచ్ ల్లో ఓటమిపాలైంది.


More Telugu News