ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ ఆత్మహత్యకు అప్పులే కారణమా?
- సీఎఫ్ఎం ఫైనాన్స్ సంస్థకు రూ.252 కోట్లు అప్పు బాకీ పడ్డ నితిన్
- అప్పు రికవరీ ప్రక్రియ ప్రారంభించాలంటూ ట్రైబ్యునల్ తీర్పు
- ఈ నేపథ్యంలో నితిన్ ప్రాణాలు తీసుకుని ఉంటారని బాలీవుడ్ వర్గాల్లో చర్చ
ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ ఆనుమానాస్పద మృతి బాలీవుడ్‌ను కుదిపేస్తోంది. అకస్మాత్తుగా ఆయన బలవన్మరణానికి ఎందుకు పాల్పడ్డారో తెలీక పలువురు విచారంలో కూరుకుపోయారు. అయితే, అప్పుల భారంతో నితిన్ ఒత్తిడి ఎదుర్కొంటున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువుడుతున్నాయి. నితిన్ చంద్రకాంత్ దేశాయ్ చెల్లించాల్సిన మొత్తం అప్పు రూ. 252 కోట్లు!
జాతీయ మీడియా కథనాల ప్రకారం, 2016, 2018 సంవత్సరాల్లో నితిన్ సీఎఫ్ఎం ఫైనాన్స్ సంస్థ నుంచి మొత్తం రూ.180 కోట్లను అప్పుగా తీసుకున్నారట. ఇందు కోసం 42 ఎకరాల స్థలం, ఇతర ఆస్తులను తనఖా పెట్టారు. ఈ మొత్తాన్ని ఆయన సకాలంలో తిరిగి చెల్లించలేకపోవడంతో సీఎఫ్ఎం సంస్థ ఈ అప్పు రికవరీ చేసే బాధ్యతను ఎడల్‌వీస్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ సంస్థకు అప్పగించింది. ఈ క్రమంలో ‘ఎడల్‌వీస్’ లా ట్రైబ్యునల్‌ను ఆశ్రయించగా రుణరికవరీ ప్రక్రియ ప్రారంభించేందుకు ట్రైబ్యునల్ అనుమతించింది. నితిన్ మొత్తం రూ.252 కోట్లు బాకీ పడ్డట్టు ఈ విచారణలో వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రుణభారం తట్టుకోలేకే ఆయన బలవంతంగా తనువు చాలించి ఉంటారని బాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడ్డాయి.