భారతీయులకు షెంజెన్ వీసా దరఖాస్తులను నిలిపివేసిన స్విట్జర్లాండ్

  • సిబ్బంది కొరతే కారణమన్న స్విట్జర్లాండ్ ఎంబసీ 
  • ప్రస్తుతం పరిశీలనలోని దరఖాస్తుల్లో 94 శాతం 2019 నాటివేనన్న స్విట్జర్లాండ్ విదేశాంగ శాఖ
  • చైనా పర్యాటకులకూ షెంజెన్ వీసా నిలిపివేత 
భారతీయులకు షెంజెన్ వీసా దరఖాస్తులను నిలిపివేస్తున్నట్టు స్విట్జర్లాండ్ ఎంబసీ తాజాగా ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు భారీగా పెరిగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. స్విస్ ఎంబసీల్లో ప్రస్తుతం సిబ్బంది అధికంగా ఉందని స్విట్జర్లాండ్ టూరిజం ఈస్ట్ మార్కెట్స్‌ విభాగానికి నేతృత్వం వహిస్తున్న బాస్‌హార్డ్ పేర్కొన్నారు. సిబ్బంది కొరత కారణంగా దరఖాస్తుల ప్రాసెసింగ్‌లో జాప్యం జరుగుతోందని చెప్పారు. భారతీయులతో పాటూ చైనా పర్యాటకులకు షెంజెన్ వీసా దరఖాస్తులను తాత్కాలికంగా నిలిపివేశారు. 

ఈ పరిణామంపై స్విట్జర్లాండ్ విదేశీ వ్యవహారాల శాఖ కూడా స్పందించింది. ప్రస్తుతం తాము ప్రాసెస్ చేస్తున్న దరఖాస్తుల్లో 94 శాతం 2019 నాటివేనని వెల్లడించింది. ఇతర షెంజెన్ దేశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని పేర్కొంది. 




More Telugu News