హైదరాబాద్ పేదలకు కేటీఆర్ శుభవార్త.. లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఖరారు

  • ఈ నెల 15 నుంచి పంపిణీ ప్రారంభిస్తామన్న మంత్రి
  • అక్టోబర్ లోపు లక్ష ఇళ్లను లబ్దిదారులకు అందిస్తామని వెల్లడించిన కేటీఆర్
  • ప్రతి నియోజకవర్గంలో 4 వేల మందికి ఇళ్లు లభిస్తాయని వెల్లడి
హైదరాబాద్ మహానగరంలో పేదలకు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పారు. నగరంలో నిర్మాణం పూర్తయిన డబుల్‌ బెడ్రూం ఇళ్లను అర్హులైన పేదలకు పంచుతామని తెలిపారు. ఈ నెల 15 నుంచి అక్టోబరులోగా లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేయబోతున్నామని ఆయన ఈ రోజు ప్రకటించారు. నియోజకవర్గానికి 4వేల చొప్పున ఇళ్లు కేటాయిస్తామని తెలిపారు. 

గృహలక్ష్మీ పథకం కింద నియోజకవర్గానికి మూడు వేల కుటుంబాలకు నగదు సాయం అందిస్తామని చెప్పారు. ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌ ఈ ప్రకటన చేశారు. ఎల్బీ నగర్‌‌లో జీవో నెం.118 కింద రెగ్యులరైజ్‌ చేసిన పట్టాలను లబ్ధిదారులకు ఆయన అందజేశారు. ఒక్క ఎల్బీనగర్‌ నియోజకవర్గంలోనే 4 వేల డబుల్‌ బెడ్రూం ఇళ్లు, గృహలక్ష్మీ పథకం కింద 3 వేల ఇళ్లు వస్తాయని తెలిపారు.


More Telugu News