జగన్ పై వెబ్ సిరీస్ తీస్తున్నా.. తెల్ల జుట్టు ఉన్నవాళ్లు కూడా నటించొచ్చు: జనసేన నేత పోతిన మహేశ్

  • ఏపీ మంత్రులకు సినిమా గురించి ఎందుకన్న మహేశ్
  • పదవులకు రాజీనామా చేసి రివ్యూలు రాసుకోవాలని సూచన
  • తన వెబ్ సిరీస్ లో నటించేందుకు వైసీపీ నేతలు కూడా ట్రై చేసుకోవచ్చని ఆఫర్
రాష్ట్రంలో ప్రజా సమస్యలను గాలికొదిలేసిన వైసీపీ మంత్రులు, నేతలు సినిమాలపై పడ్డారని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ విమర్శించారు. పవన్ ఫొటో చూసినా, పేరు విన్నా వణికిపోతున్నారని చెప్పారు. ఏపీ మంత్రులు తమ శాఖల గురించి మాట్లాడకుండా... కేవలం పవన్ గురించే మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. 'బ్రో' సినిమా గురించి నిర్మాతలు, దర్శకులు మాట్లాడాలి కానీ... మంత్రులు మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. సినిమాల గురించే మాట్లాడతామంటే మంత్రి పదవులకు రాజీనామా చేసి రివ్యూలు రాసుకోవాలని అన్నారు. 

దమ్ముంటే ప్రత్యేక హోదా, పోలవరం, రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం వంటి అంశాలపై చర్చకు రావాలని మహేశ్ సవాల్ విసిరారు. బ్లాక్ మనీని వైట్ చేయడంలో జగన్ దిట్ట అని చెప్పారు. జగన్ పై సినిమా తీయాలనే ఆలోచన వచ్చినప్పటికీ బడ్జెట్ లేదని... అందుకే ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేశానని చెప్పారు. వెబ్ సిరీస్ కు కొన్ని పేర్లు ఆలోచించానని... డాటర్ ఆఫ్ వివేకా, డ్రైవర్ డోర్ డెలివరీ, అరగంట అదే ఇల్లు, ఒక ఖైదీ వదిలిన బాణం, కోడికత్తి సమేత శ్రీను, గంజాయి మిస్ అయిన అమ్మాయి మధ్యలో ఇసుక దిబ్బలు, తల్లి చెల్లి ఖైదీ నెంబర్ 6093 పేర్లు ఆ జాబితాలో ఉన్నాయని  తెలిపారు. వెబ్ సిరీస్ లో నటించేందుకు వైసీపీలో ఉన్న నటులు కూడా ట్రై చేసుకోవచ్చని చెప్పారు. తెల్ల జుట్టు ఉన్న వాళ్లకు కూడా అవకాశం ఇస్తామని తెలిపారు. వెబ్ సిరీస్ లో ఏ ఒక్క విషయాన్ని విస్మరించబోమని... అన్ని వివరాలను వివరిస్తామని చెప్పారు. బయటి డైరెక్టర్ తో వెబ్ సిరీస్ తీస్తామని తెలిపారు.   

తమతో పెట్టుకుంటే గోదావరి జిల్లాల్లో వారాహి యాత్రలో నిమ్మకాయలు నలిగిపోయినట్టు నలిగిపోతారని మహేశ్ హెచ్చరించారు. పవన్ పై అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయని చెప్పారు. 



More Telugu News