పొరపాటున కూడా వీటిని ఓవెన్ లో వేడి చేయొద్దు!
- రైస్ ను అస్సలు ఓవెన్ లో రీహీట్ చేసుకోవద్దు
- గుడ్డును సైతం రీహీట్ చేసుకోవడం పనికిరాదు
- రీహీట్ తో కొన్నింటి గుణమే మారిపోతుంది
- కొన్నింటి రుచిలో మార్పు
వండిన పదార్థాలను కొంత సమయం తర్వాత తిరిగి మరోసారి ఓవెన్ లో వేడి చేసుకుని తినే అలవాటును కొంత మంది పాటిస్తుంటారు. ఆహారం వృథా కాకుండా, తినడానికి అనుకూలంగా ఉంటుందని అలా చేస్తుంటారు. అయితే ఇందుకు సంబంధించి ఎక్కువ మందికి తెలియని విషయం ఒకటి ఉంది. చల్లారిన పదార్థాలను మళ్లీ మళ్లీ వేడిచేసుకుని తినడం అనేది అన్నింటికీ అనుకూలం కాదు. కొన్నింటి విషయంలో వాటి రూపు రేఖలు మారిపోతాయి. కనుక మళ్లీ మళ్లీ వేడి చేసుకుని తినే వారు దీని గురించి తెలుసుకోవాలి.
- ఫ్రెంచ్ ఫ్రైస్ ను మైక్రోవేవ్ ఓవెన్ లో తిరిగి వేడి చేయడం వల్ల వాటిలోని కరకరలాడే గుణం పోతుంది. మెత్తగా అయిపోతాయి. నిజానికి ఫ్రెంచ్ ఫ్రైస్ ప్రత్యేకతే కరకరలాడడం. కనుక మెత్తగా ఉన్నా ఫర్వాలేదనుకుంటే అలా చేసుకోవచ్చు.
- ఇక మీట్ ను కూడా ఇలా వేడి చేసుకుని తింటుంటారు. మీట్ ను ఓవెన్ లో రీహీట్ చేయడం వల్ల దాని రుచి తగ్గిపోతుంది. దీనికంటే కూడా గ్రిల్లింగ్ లేదా ప్యాన్ ఫ్రయింగ్ చేసుకోవడం వల్ల రుచి కోల్పోవడం ఉండదు.
- ఉడకబెట్టిన గుడ్డును లేదా గుడ్డుతో చేసిన పదార్థాలను చల్లారిందని చెప్పి మరోసారి ఓవెన్ లో వేడి చేసుకోవద్దు. దీనికి బదులు చేసిన వెంటనే తినడం లేదంటే చల్లగానే తినడం మంచిది. ముఖ్యంగా గుడ్డును ఓవెన్ లో వేడి చేయడం సూచనీయం కాదు.
- చేపలు, సముద్ర ఉత్పత్తులు సైతం ఓవెన్ లో వేడి చేసుకోవద్దు. అందులోని పోషకాలు పోతాయి. పైగా రుచి కూడా తగ్గిపోతుంది.
- ఆకుపచ్చని కూరలైన పాలకూర తదితర వాటిని తిరిగి ఓవెన్ లో వేడి చేయడం వల్ల వాటిల్లోని నైట్రేట్లు విషతుల్యంగా మారతాయి. ఇవి కార్సినోజెనిక్. ఇలా చేయడం వల్ల కేన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది.
- టమాటా సాస్ ను ఓవెన్ లో వేడి చేస్తే అందులో మరకలు పడిపోతాయి.
- చల్లారిన రైస్ ను తీసుకెళ్లి ఓవెన్ లో వేడి చేయడం వల్ల అందులోని బేసిల్లస్ సెరస్ చనిపోతుంది. అప్పుడు విడుదలయ్యే స్పోర్స్ హాని కలిగిస్తాయి. ఫుడ్ పాయిజనింగ్, డయేరియాకి దారితీయవచ్చు.