ఆకాకర గురించి తెలిస్తే తినకుండా ఉండలేరు..!

  • విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం
  • మధుమేహులకు మరింత మంచిది
  • గుండె జబ్బులు, ఆర్థరైటిస్ బాధితులకూ ప్రయోజనం
గుండ్రంగా, ముళ్లతో ఉమ్మెత్త కాయల మాదిరిగా ఉండే కాయగూర ఆకాకర (బోడ కాకర) గురించి చాలా మందికి తెలుసు. అద్భుతమైన రుచితో ఉండే దీన్ని తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఇది వర్షకాలంలోనే కనిపిస్తుంది. సీజనల్ వెజిటబుల్. మంచి ఫైబర్, పోషకాలతో కూడిన ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అది పడకపోవడం అనేది దాదాపుగా ఉండదు. దీన్ని కంటోలా అని, స్పైనీ గార్డ్ అని పిలుస్తారు. 

ప్రయోజనాలు
  • ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అలాగే విటమిన్లు, మినరల్స్ అయిన విటమిన్ సీ, ఏ, క్యాల్షియం, ఐరన్, పొటాషియం తగిన మోతాదులో ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తుంటాయి. అలాగే, ఎముకలు సైతం ఆరోగ్యంగా ఉంటాయి.  
  • క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. కనుక మధుమేహంతో బాధపడే వారికి మంచిది. రక్తంలో చక్కెర స్థాయుల నియంత్రణలో కంటోలా మంచి ఫలితాలను ఇస్తున్నట్టు పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
  • పీచు ఉండడంతో తిన్న కొద్ది సమయానికే ఆకలి అనిపించదు. ఇది కూడా ఒక రకంగా ప్రయోజనమే. పీచు ఉన్నందున జీర్ణ ప్రక్రియకు మంచి చేస్తుంది. విరేచనం సాఫీ అయ్యేందుకు సాయపడుతుంది. మలబద్ధకం సమస్య ఉండదు. తరచూ దీన్ని తినే వారికి పేగుల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. 
  • ఆకాకరలో యాంటీ ఆక్సిడెంట్లు (ఫ్లావనాయిడ్స్, పాలీఫెనాల్స్) ఉండడంతో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను దూరం చేస్తుంది. ఫ్రీరాడికల్స్ కారణంగా కణాలకు నష్టం జరగకుండా కాపాడుతుంది.
  • ఫైబర్ తో పాటు పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉండడంతో గుండెకు సైతం మంచి చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. పొటాషియం రక్తపోటును తగ్గిస్తుంది. దీంతో గుండెకు రిస్క్ తగ్గుతుంది.
  • ఆకాకరలో విటమిన్ సీ కూడా లభిస్తుంది. వ్యాధి నిరోధక శక్తికి విటమిన్ సీ ఎంతో అవసరం. ఇన్ఫెక్షన్లు, అనారోగ్యంపై బలంగా పోరాడగలదు. వైరల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గును తగ్గించడంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తుంది. 
  • పైగా దీనిలో యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ గుణాలు కూడా ఉన్నాయి. ఆర్థరైటిస్ బాధితులకు, కీళ్లలో వాపు, నొప్పులతో బాధపడే వారికి దీన్ని తినడం వల్ల ఉపశమనం లభిస్తుంది.


More Telugu News