లండన్ వీధుల్లో స్టైలిష్ లుక్ లో సితార

  • కుటుంబంతో కలిసి లండన్ కు వెళ్లిన మహేశ్ బాబు
  • ట్రెండీ వేర్ లో ఆకట్టుకుంటున్న సితార ఫొటోలు
  • ఓ జువెలరీ కంపెనీకి బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్న సితార
టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు తన కుటుంబంతో కలిసి మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లారు. భార్య నమ్రత, కొడుకు గౌతమ్, కూతురు సితారలతో కలిసి లండన్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. మరోవైపు లండన్ వీధుల్లో సితార చక్కర్లు కొడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్రెండీ వేర్ లో స్టైలిష్ లుక్ లో సితార ఆకట్టుకుంటోంది. 

మరోవైపు చిన్న వయసులో సితార సెలెబ్రిటీ స్టేటస్ ను అందుకుంది. ఓ ఇంటర్నేషనల్ జువెలరీ బ్రాండ్ కు ఆమె బ్రాండ్ అంబాసడర్ గా ఉంది. న్యూయార్క్ లోని టైమ్స్ స్వ్కేర్ లో కూడా ఆమె హోర్డింగ్స్ ను ప్రదర్శించారు. ఈ యాడ్ కు ఆమె కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం. తన తొలి సంపాదనను సితార ఒక ఛారిటీకి డొనేట్ చేసింది.


More Telugu News