ఎన్డీయే, ఇండియా కూటమిలపై కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
- సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న ఎన్డీయే, ఇండియా కూటములు
- తాము ఏ కూటమిలో లేమని స్పష్టం చేసిన కేసీఆర్
- ఇప్పటి వరకు దేశంలో అధికారంలో ఉన్నవారే ఆ కూటముల్లో ఉన్నారని విమర్శ
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటములు ముందుకు సాగుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఏ కూటమిలో చేరకుండా తటస్థంగా ఉంది. తాజాగా ఈ కూటములపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్న మహారాష్ట్ర పర్యటనకు వెళ్లిన కేసీఆర్... అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. అనంతరం మీడియాతో ముచ్చటిస్తూ.. తాము ఏ కూటమిలో కూడా లేమని స్పష్టం చేశారు. ఆ కూటముల్లో చేరాల్సిన అవసరం కూడా తమకు లేదని అన్నారు. ఇప్పటి వరకు దేశంలో అధికారంలో ఉన్నవారే ఆయా కూటముల్లో ఉన్నారని... దేశంలో వారు తీసుకొచ్చిన మార్పు ఏమీ లేదని విమర్శించారు.
భారత్ లో సరికొత్త మార్పు రావాల్సిన అవసరం ఉందని... అది ఈ రెండు కూటముల వల్ల సాధ్యం కాదని కేసీఆర్ అన్నారు. అందుకే ఆ కూటముల్లో తాము చేరలేదని చెప్పారు. అలాగని బీఆర్ఎస్ ఒంటరిగా లేదని... తమతో కలిసి నడిచే పార్టీలు కూడా ఉన్నాయని తెలిపారు.