వరుస ఫిఫ్టీలు... ధోనీ సహా వీరి జాబితాలో చేరిన ఇషాన్ కిషన్
- 43 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న ఇషాన్
- 64 బంతుల్లో 77 పరుగులు చేసి ఔట్
- ద్వైపాక్షిక మూడు వన్డేల సిరీస్‌లో హ్యాట్రిక్ సాధించిన ఆటగాళ్ల జాబితాలోకి ఇషాన్
వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత క్రికెట్ జట్టు ఓపెనర్ ఇషాన్ కిషన్ హ్యాట్రిక్ అర్ధ సెంచరీతో అదరగొట్టారు. ప్రస్తుత వన్డేలో 43 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న ఇషాన్, మొత్తంగా 64 బంతుల్లో 77 పరుగులు చేశాడు. ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్లు బాదాడు. చివరికి కరియా వేసిన 20వ ఓవర్ నాలుగో బంతికి స్టంప్ ఔట్ అయ్యాడు. భారత్ 144 పరుగుల వద్ద ఇషాన్ రూపంలో తొలి వికెట్‌ను కోల్పోయింది.
అయితే ఇషాన్ అద్భుతమైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ద్వైపాక్షిక మూడు వన్డేల సిరీస్‌లో హ్యాట్రిక్ అర్ధ సెంచరీలు సాధించిన ఆరో టీమిండియా క్రికెటర్‌గా నిలిచాడు. ఇషాన్ కంటే ముందు ఈ జాబితాలో 1982లో కృష్ణమాచారి శ్రీకాంత్, 1985 దిలీప్ వెంగ్ సర్కార్, 1993లో అజారుద్దీన్, 2019లో ధోనీ, 2020లో శ్రేయాస్ అయ్యర్ ఉన్నారు. ఇషాన్ కిషన్‌కు ఇది ఆరో వన్డే అర్ధ సెంచరీ.
కాగా, భారత్ 38 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 242 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యాలు క్రీజులో ఉన్నారు. గిల్ శతకానికి చేరువలో ఉన్నాడు.