సాధ్యపడదన్న కేసీఆర్ నోటి నుంచే కార్మికులు ఆ మాట చెప్పించారు: వైఎస్ షర్మిల
- సోషల్ మీడియా వేదిక ద్వారా స్పందించిన వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు
- సమ్మెలో అసువులు బాసిన కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి
- కార్మికుల డిమాండ్లన్నింటినీ నెరవేర్చాలన్న షర్మిల
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఫేస్‌బుక్ ద్వారా ఆమె ఆర్టీసీ విలీనంపై స్పందించారు. అసాధ్యమన్న కేసీఆర్ నోట కార్మికులు సాధ్యం అనిపించారన్నారు. ఈ మేరకు షర్మిల స్పందిస్తూ.. ఆర్టీసీ విలీనం సాధ్యపడదన్న కేసీఆర్ నోటి నుంచే ఆర్టీసీని విలీనం చేస్తామనే మాటను కార్మికులు చెప్పించారన్నారు.
అంతేకాదని, ఆర్టీసీ సమ్మెలో అసువులు బాసిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్మికుల డిమాండ్లన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సోమవారం నాటి తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి కేటీ రామారావు సోమవారం సాయంత్రం మీడియాకు తెలిపారు.