హైదరాబాద్ నగరంలో బస్సు పాస్ ఛార్జీలు పెంచిన ఆర్టీసీ
- జంట నగరాల ప్రయాణికులకు షాకిచ్చిన ఆర్టీసీ
- రూ.100గా ఉన్న డే-పాస్ ధర రూ.120కి పెంపు
- సీనియర్ సిటిజన్స్, మహిళల పాస్ ధర రూ.100కి పెంపు
హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ షాకిచ్చింది. నగరంలోని సిటీ బస్ పాస్ ధరలను పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. డే బస్ పాస్ ధరలు పెరిగాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన మరుసటి రోజే ఈ నిర్ణయం తీసుకుంది.
ఇప్పటి వరకు రూ.100గా ఉన్న డే-బస్ పాస్ ధర రూ.120కి, మహిళలు, సీనియర్ సిటిజన్స్‌కు రూ.80గా ఉన్న డే-పాస్ ధరను రూ.100కి పెంచింది. డే బస్ పాస్ గతంలో రూ.120 ఉన్నప్పుడు రోజుకు 25వేల పాస్‌లు విక్రయిస్తే, రూ.100 అయ్యాక 40వేలు అమ్ముడుపోయాయి. ఇప్పుడు మరోసారి పెరిగాయి. బస్ టిక్కెట్ ధరలు కూడా గతంలో భారీగానే పెరిగాయి.