రాయపాటి నివాసం సహా తొమ్మిదిచోట్ల ఈడీ సోదాలు

  • ట్రాన్స్‌స్ట్రాయ్ డైరెక్టర్ల ఇళ్లలోను ఈడీ బృందాల సోదా
  • 13 బ్యాంకుల నుండి రూ.9 వేల కోట్లకు పైగా రుణాలు
  • సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు
తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సహా ట్రాన్స్‌స్ట్రాయ్ డైరెక్టర్ల ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, గుంటూరులో తొమ్మిది చోట్ల ఈడీ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. రాయపాటి హైదరాబాద్‌, జూబ్లి హిల్స్ లోని రోడ్ నెంబర్ 27లో నివసిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు గుంటూరులోని ఆయన నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

ఈ కంపెనీ దాదాపు పదమూడు బ్యాంకుల నుండి తొమ్మిది వేల కోట్లకు పైగా రుణాలు తీసుకొని, డొల్ల కంపెనీలకు మళ్లించినట్లుగా సీబీఐ ఇదివరకు కేసు నమోదు చేసింది. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ట్రాన్స్‌స్ట్రాయ్ కంపెనీ ఖాతాల నుండి నిబంధనలకు విరుద్ధంగా సింగపూర్‌కు నగదు బదిలీ అయినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సోదాలు జరుగుతున్నాయి.


More Telugu News