తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే!
- సెప్టెంబర్ 15న టెట్ పేపర్–1, పేపర్ –2 పరీక్షలు
- రేపటి నుంచి ఈనెల 16 దాకా దరఖాస్తులు
- పరీక్షలకు రెండున్నర లక్షల మంది దాకా హాజరయ్యే అవకాశం
తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సెప్టెంబర్ 15న టెట్ పేపర్–1, పేపర్ –2 పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. రేపటి నుంచి ఈ మేరకు దరఖాస్తులను స్వీకరించనుంది. ఈ నెల 16వ తేదీ దాకా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. https://tstet.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయవచ్చు. ఒక్కో పరీక్ష ఫీజు రూ.400.
పేపర్–1 పరీక్షను డీఈడీ, బీఈడీ అభ్యర్థులు రాసుకునేందుకు అవకాశం కల్పించారు. బీఈడీ చేసిన వాళ్లు రెండు పేపర్లను రాసుకోవచ్చు. ఈ సారి టెట్ పరీక్షకు 2 లక్షల నుంచి రెండున్నర లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ 15న పరీక్ష నిర్వహించి, అదే నెల 27న ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.