ఈ నెల 4వ తేదీన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వస్తున్న రెండు తెలుగు సినిమాలివే!

ఈ నెల 4వ తేదీన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వస్తున్న రెండు తెలుగు సినిమాలివే!
  • జులై 7న వచ్చిన 'రంగబలి'
  • కామెడీ హైలైట్ గా నిలిచిన సినిమా 
  • నెట్ ఫ్లిక్స్ ద్వారా ఈ నెల 4న స్ట్రీమింగ్
  • జూన్ 2వ తేదీన థియేటర్లకు వచ్చిన 'పరేషాన్' 
  • సోనీ లివ్ ద్వారా ఈ నెల 4న  స్ట్రీమింగ్ 
నాగశౌర్య హీరోగా 'రంగబలి' సినిమా రూపొందింది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి, పవన్ బాసం శెట్టి దర్శకత్వం వహించాడు.  నాగశౌర్య - యుక్తి తరేజా జంటగా నటించిన ఈ సినిమా, జులై 7వ తేదీన థియేటర్లకు వచ్చింది. పవన్ సీహెచ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా, కంటెంట్ పరంగా తీసిపారేయదగినదేం కాదు. ఈ సినిమాలో సత్య కామెడీ .. హీరో మాస్ యాక్షన్ దృశ్యాలు .. హీరో ఫ్లాష్ బ్యాక్ ఆకట్టుకుంటాయి. కానీ ఎందుకనో ఈ సినిమా తగిన ఆదరణ థియేటర్స్ వైపు నుంచి కనిపించలేదు. అలాంటి ఈ సినిమా ఈ నెల 4వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్' లో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ నెల 4వ తేదీనే 'సోనీలివ్' లో 'పరేషాన్' సినిమా స్ట్రీమింగ్ కానుంది. తిరువీర్ - పావని కరణం జంటగా నటించిన ఈ సినిమాకి, రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వం వహించాడు. యశ్వంత్ నాగ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా, జూన్ 2వ తేదీన థియేటర్స్ కి వచ్చింది. కామెడీ ప్రధానమైన కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా, ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. 



More Telugu News