'పెదకాపు' చేసే రచ్చ మామూలుగా ఉండదట!

  • 'నారప్ప'తో మెప్పించిన శ్రీకాంత్ అడ్డాల 
  • ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'పెదకాపు'
  • గ్రామీణ రాజకీయాల నేపథ్యంలో నడిచే కథ 
  • రెండు భాగాలుగా విడుదల కానున్న సినిమా
ఈ మధ్య కాలంలో గ్రామీణ నేపథ్యంలో కథలకు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోంది. గ్రామీణ కథలకు ప్రేక్షకులు త్వరగా కనెక్ట్ అవుతున్నారు. అందువలన ఈ సారి శ్రీకాంత్ అడ్డాల కూడా అదే తరహా కథను సెట్ చేసుకున్నాడు. శ్రీకాంత్ అడ్డాల మొదటి నుంచి కూడా ప్రేమ - గ్రామీణ నేపథ్యం కలిగిన కథల పట్ల ఎక్కువ ఆసక్తిని కనబరుస్తూ వెళ్లాడు. 

రీమేక్ అయినప్పటికీ గ్రామీణ నేపథ్యంలో ఆ మధ్య ఆయన చేసిన 'నారప్ప' సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సారి ఆయన గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథకు పొలిటికల్ టచ్ ఇస్తూ ఒక సినిమాను రూపొందించాడు .. ఆ సినిమా పేరే 'పెదకాపు'. గోదావరి జిల్లాల నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. గ్రామస్థాయిలో జరిగే రాజకీయాలకు అద్దం పట్టనుంది. 

మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో, యాక్షన్ సన్నివేశాలు .. రక్తపాతం కాస్త ఎక్కువగానే ఉన్నాయని ఫస్టు కాపీ చూసినవారు చెబుతున్నారు. దర్శకుడిగా శ్రీకాంత్ అడ్డాలలోని కొత్త కోణం ఈ సినిమాతో కనిపిస్తుందని అంటున్నారు. ఇందులో ఆయన కూడా ఒక చిన్న పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాను ఆయన రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తుండటం విశేషం.


More Telugu News